Naga Chaitanya తండేల్ మూవీ రివ్యూ తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీవాసు నిర్మించిన చిత్రం తండేల్. ప్రేమ కథగా, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
ఉత్తరాంధ్ర జాలరు కథగా రూపొందిన ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి యువ సామ్రాట్ నాగచైతన్య, జంటగా నటించారు. ఈ చిత్రం అమెరికాలో ప్రీమియర్స్ అనంతరం నెటిజన్లు
అభిమానులు తెలియజేసిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..ఇలా ఉన్నాయి
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, గేయ రచయిత శ్రీమణి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంను అమెరికాలో ప్రత్యాంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు. , ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే పాటలు కు మంచి స్పందన రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు ఈ చిత్రం గురించి ఏమంటున్నారంటే..
తండేల్ చిత్రం Naga Chaitanya కు కమ్ బ్యాక్ మూవీ అనవచ్చు. ఆ సినిమా కోసం చూపించిన యాక్టింగ్ , చేసిన హార్డ్ వర్క్,నిజంగా ప్రశంసనీయం. ఎప్పటిలానే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో సాయిపల్లవి రాకింగ్. చందూ మొండేటి దర్శకత్వం, డీఎస్పీ మ్యూజిక్ హైలెట్. యదార్థ సంఘటనలతో తీసిన చిత్రం థియేటర్లో చుడండి అని నెటిజన్ కామెంట్ చేశాడు.
నాగచైతన్య యాక్టింగ్ సూపర్ ఉంది. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంటాడు. ప్రీ క్లైమాక్స్ లో నాగచైతన్య క్యారెక్టర్ గురించి పాకిస్థానీ పోలీసులు ఇచ్చే ఎలివేషన్ బాగుంది. డీఎస్పీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.తండేల్ చిత్రం బాగుంది. మధ్యలో ఎమోషన్ ఉంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించేలా అనిపించాడు. అతడు కెరీర్ ఇది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ఇచ్చాడు అని నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.
తండేల్ ఫస్టాఫ్ బాగుంది. స్క్రిప్టును చాలా బాగా రాసారు రూపొందించారు. Naga Chaitanya యాక్టింగ్ ప్రశంసనీయంగా ఉంది. ఈ చిత్రంకు పనిచేసిన ఇతర డిపార్ట్మెంట్స్ పనితీరు చాలా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
తండేల్ చిత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్టు లో ఈచిత్రం సూపర్ అనిపించింది. ఎవరూ ఊహించని విధంగా ఎపిసోడ్ ఉంటుంది. పాటలు చాలా బాగున్నాయి. సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది . నాగచైతన్య పెర్ఫార్మెన్స్ తో ఇరుగదీశాడు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
తండేల్ కి అక్కినేని హీరో భారీ రెమ్యునరేషన్ నే అందుకున్నట్టుగా
సినీవర్గాలు చెబుతున్నాయి. ఒక్క నాగ చైతన్య మాత్రమే కాకుండా ఇద్దరు కూడా హీరోయిన్ సాయి పల్లవి కూడా రెమ్యునరేషన్ అందుకుందట. మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తండేల్ కి నాగ చైతన్య 15 కోట్లు రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేస్తే సాయి పల్లవి మాత్రం 5 కోట్లు అందుకుంది అని తెలుస్తుంది.