Nagarjuna Upcoming Movie : గీతా ఆర్ట్స్ లో కింగ్ నాగార్జున

Written by 24 News Way

Published on:

Nagarjuna Upcoming Movie : గీత ఆర్ట్స్ లో  కింగ్ నాగార్జున సిక్కోలు వేదిక ప్రకటించిన అల్లు అరవింద్
గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండెల్. అల్లు అరవింద్ ప్రజెంట్ లో బన్నీవాసు నిర్మించారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఈ నేపథ్యంలో నిన్న గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో గ్రాండ్ గా థాంక్యూ మీట్ నిర్వహించారు. హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ త్వరలోనే మరో అక్కినేని హీరోతో సినిమా చేయబోతున్నట్లుగా తెలియజేశారు.

టాలీవుడ్ లో అక్కినేని అల్లు ఫ్యామిలీల మధ్య స్పెషల్ బాండింగ్ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్వహిస్తున్న కింగ్ నాగార్జున  అధినేత అల్లు అరవింద్ మధ్య ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. రెగ్యులర్ గా కలుసుకోకపోయినా కలిసినప్పుడు మాత్రం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఇక గీతార్స్ బ్యానర్లు అక్కినేని వారసులైన నాగచైతన్య అఖిల్ కు మంచి హిట్ సినిమాలు వచ్చాయి ఈ క్రమంలో నాగుతో ఒక మూవీ చేయాలని ఫాన్స్ కోరుతున్నారు అయితే త్వరలోనే Nagarjuna Upcoming Movie నాగార్జునతో కూడా ఒక సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకుంటున్నారు.

తండెల్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిన్న గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో గ్రాండ్ గా థాంక్యు పెట్టారు ఈ సందర్భంగా చైతన్య అఖిల్ వీరిద్దరికీ హిట్ ఇచ్చారు. కింగ్ నాగార్జునతో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా చేసే ఆలోచనలు ఉందా అని ప్రశ్నించగా కచ్చితంగా ఉంటుందని అల్లు అరవింద్ చెప్పారు. మీరు చెప్పినట్టు కాదు కానీ ఇంకో మంచి కథ తయారవుతుంది స్క్రిప్ట్ పూర్తి కాగానే నాగార్జునతో సినిమా ఉంటుంది అని ఆయన బదులిచ్చారు దీనిబట్టి త్వరలోనే అల్లు కాంబినేషన్లు మరో ప్రాజెక్ట్ రాబోతుందని తెలుస్తుంది.

గీత ఆర్ట్స్ బ్యానర్లు యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా 100% లవ్ అనే సినిమా వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీ వాసు నిర్మాతగా పరిచయమయ్యారు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు  భారీ బడ్జెట్ ఖర్చు చేసి తండెల్ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కినేని హీరోని 100 కోట్ల క్లబ్లో కూర్చోబెడతామని ప్రామిస్ చేశారు. చెప్పినట్టుగానే ఈ సినిమా మరికొన్ని రోజులు మైల్ రాయి మార్కును క్రాస్ అయిపోతుంది చందు మండేటి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే 90 కోట్లకు పైగా వసూలు రాబట్టింది జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం రూపొందించారు. బన్నీ వాస్ బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది అఖిల్ కెరీర్ లో ఫస్ట్ హిట్ గా నిలిచింది ఇలా అక్కినేని హీరోలకు మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇచ్చిన బన్నీ వాస్ నాగార్జున చేసి సూపర్ డూపర్ హిట్టు కొడతామని ఇటీవల సక్సెస్ మీట్ లో ఆయన చెప్పారు. లేటెస్ట్ గా అల్లు అరవింద్ సైతం నాగార్జున కోసం ఒక స్టోరీ రెడీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

హీరో నాగార్జున విషయానికొస్తే గత ఏడాది సంక్రాంతికి నా స్వామి రంగాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత సోలోగా మరో సినిమా చేయలేదు రజనీకాంత్ తో కలిసి కూలి ధనుష్ తో కుబేర వంటి చిత్రాలు ముఖ్యమైన పాత్రలు పోషించారు ఇవి హిట్ అయినా కూడా టోటల్ క్రెడిట్ నాగు ఒక్కడికే దక్కదు అందుకే సోలోగా ఓ పెద్ద సినిమా చేయాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు ఏడాది కాలంగా ఎందరో డైరెక్టర్ల పేర్లు తెరమీదకి వచ్చాయి కానీ ఏది ఫిక్స్ అవ్వలేదని మరి త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి.

Read More>>

🔴Related Post