లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న మూవీలో అదిరిపోయిన నాగార్జున లుక్. ఈ సినిమాలో నాగార్జున లుక్కు చూస్తుంటే కింగ్ ఈజ్ బ్యాక్ అని అనాలనిపిస్తుంది. అంత మాస్ గా ఉంది. ఇంకా కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా యి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పేరు కూలీ .ఈ చిత్రం టైటిల్ లుక్ మరియు వీడియోస్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ చిత్రంలో నటిస్తున్న కీలక నటీనటుల యొక్క అప్డేట్స్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.
ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున సీయోను పాత్రలో కనిపించనున్నారని పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది అదే విషయాన్ని ఈ సినిమా మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది ఫస్ట్ లుక్ చాలా పవర్ ఫుల్ గా చాలా స్టైలిష్ గా ఉందని మనకు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. లోకేష్ కనకరాజు సినిమాలో ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ చూసి ఉన్నాము. కంటెంట్ పరంగా మరియు హీరోల లుక్కు పరంగా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లోకేష్ కనకరాజు గత మూవీలను చూసుకుంటే ప్రతి మూవీలో హీరో లుక్ చాలా డిఫరెంట్ గా చాలా డార్క్ గా ఉంటాయి.. లోకేక్ కనకరాజ్ సినిమాలు చూస్తుంటే మనము ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్లినామా అనే భావన కలిగిస్తాయి. లోకేష్ కనకరాజు గారు తీసిన అంతకుముందు ముందు సినిమాలైనా ఖైదీ మూవీ మరియు కమలహాసన్ గారితో తీసిన విక్రం మూవీ మరియు లేటెస్ట్ గా దళపతి విజయ్ గారితో తీసిన లియో సినిమా చూస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది లోకేష్ కనకరాజు గారు సినిమాలు అందులో స్టోరీ ఎంత బాగా ఉంటాయో అని. లోకేష్ కనకరాజు సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా మరియు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటూ ఉంటాయి/
లోకేష్ కనకరాజు తీసిన ఖైదీ విక్రమ్ మూవీలు తెలుగులో కూడా భారీ విజయాలను సాధించాయి అలాగే దళపతి విజయ్ గారితో తీసిన లియో సినిమా తమిళ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కానీ తెలుగులో మాత్రం యావరేజ్ మూవీగా నిలిచి పోయింది. విజయ్ తీసిన సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరిస్తున్నాడు లోకేష్ కనకరాజు. లోకేష్ కనకరాజు రీసెంట్ మూవీ పేరు కూలీ. ఈ మూవీలో రజనీకాంత్ గారితో పాటు కింగ్ నాగార్జున మరియు మలయాళ యాక్టర్ పజిల్ గారు కూడా నటించడం జరుగుతుంది ఇంకా కొంతమంది హీరోలు కూడా ఇందులో ముఖ్యపాత్ర వహిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సన్ పిక్చర్స్ తెలియజేయడం జరిగింది.లోకేష్ కనకరాజ్ మూవీలో అదిరిపోయిన నాగార్జున లుక్.