బాలీవుడ్ యాక్టర్ అర్షద్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగశ్విన్. బాలీవుడ్ యాక్టర్స్ ప్రభాస్ నీ చూసి కుళ్ళుకోవడం తప్పించి ఏమి చేయలేకపోతున్నారు . అందుకే ఏం చేయాలో అర్థం కాక ప్రభాస్ మీద అడ్డమైన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ కావాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అర్షద్ మాత్రమే కాదు బాలీవుడ్ యాక్టర్స్ ఏదో విధంగా సౌత్ ఇండియా గురించి తప్పుగా మాట్లాడడం లేక చిన్న చూపు చేసి మాట్లాడడం ఈమధ్య ఎక్కువగా జరుగుతుంది.. అందులో హిందీ జనాలు వాళ్ళ హిందీ సినిమాల కన్నా ఎక్కువగా సౌత్ సినిమాలను చూడడం వాడికి కలెక్షన్లు తెప్పించడం. చూసి బాలీవుడ్ యాక్టర్స్ అందరికీ కోపం తెప్పిస్తుంది ఈర్షణ కలిగిస్తుంది ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ వాళ్లకి ఒక రకంగా భయం అని చెప్పవచ్చు ఇప్పుడు. అసలు సౌత్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటేనే బాలీవుడ్ ఇండస్ట్రీ వణుకుతుంది అందులో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏదైనా మూవీ వస్తుంది అని తెలవగానే బాలీవుడ్ సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేస్తూనే పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఉన్నది.. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం.
అర్షద్ లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అందులో ప్రభాస్ గురించి కల్కి మూవీ గురించి ప్రస్తావించడం కూడా జరిగింది.అర్షద్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కల్కిమూవీ గురించి అడగగానే తనకు కల్కి మూవీ నచ్చలేదని అందులో ప్రభాస్ ఒక జోకర్ల కనిపించాడు తప్పించి హీరోలా కనిపించలేదని ఒక కామెంట్ చేయడం జరిగింది.. ఆ తర్వాత అమితాబచ్చన్ గారి గురించి చెబుతూ అమితాబచ్చన్ రోలు చాలా బాగుందని. చెప్పడం జరిగింది. కానీ ప్రభాస్ గురించి మాత్రం చాలా తక్కువ చేసి మాట్లాడడం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఒళ్ళు మండేలా చేసింది.
ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది చాలా అవమానకరంగా భావించడం జరుగుతుంది.. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అర్షద్ నీ యాంటీ ఇండియన్ మనీ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ పోస్ట్ చాలా వైరల్ గా కూడా మారుతున్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ గాని మరియు వైజయంతి మూవీస్ గానీ ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు . ఈ విషయమై కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు మాత్రం స్పందించడం జరిగింది. నాగ అశ్విన్ గారు స్పందిస్తూ అర్షద్ బాయ్ మీకు ఒక విషయం చెప్తా వినండి మీరు మొదటగా మంచిగా మాట్లాడడం నేర్చుకోండి మీ పిల్లలకి నేను బుజ్జి బొమ్మలను పంపిస్తాను వాటితో నువ్వు మీ పిల్లలు ఆడుకోండి. మరియు ఇంకో విషయం ఏమిటంటే కల్కి మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ లో ప్రభాస్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ గారి గురించి అద్భుతంగా అందరూ మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ లో ప్రభాస్ గారి పాత్ర సెకండ్ పార్ట్ లో ఉంటుంది. అర్థమైందా సార్ అని నాగ్ అశ్విన్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క అర్షద్ కి మాత్రమే కౌంటర్ కాదు టోటల్ బాలీవుడ్ ఇండస్ట్రీకే నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడని మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అనుకోవడం జరుగుతుంది . అది సౌత్ ఇండియా ఇండస్ట్రీ దెబ్బ బాలీవుడ్ అబ్బా.బాలీవుడ్ యాక్టర్ అర్షద్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగశ్విన్.