Nani and Vijay Recreate yevade Subramanyam moment : బైక్ పై ఎక్కిన నాని విజయ్ దేవరకొండ. హీరో నాని విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.” కింగ్డమ్” ” ది పారడైజ్” సినిమాలతో కంపేర్ చేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో హీరోలు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.
హీరో నాని విజయ్ దేవరకొండ వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సొంత మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో కలిసి నటించారు. ఈ మూవీ వచ్చి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఇద్దరు పార్టీలో కలిశారు.
నాని మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ రీతు వర్మ ముఖ్యపాత్ర వహించారు. ఈ మూవీని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. స్వప్న శ్రీనివాస్ బ్యానర్లు రూపొందించిన ఈ చిత్రానికి ప్రియాంక దత్ స్వప్న దత్ నిర్మించారు. ఈ మూవీ వచ్చిన తేదీన మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ రీ యూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో నాని విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Nani and Vijay Recreate yevade Subramanyam moment ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నాని విజయ్ మాళవిక బైక్ మీద వెళ్లే సీన్ ఒకటి ఉంటుంది. అప్పట్లోనే సినిమాకి ఎక్కువ పబ్లిసిటి చేశారు. ఇప్పుడు అదే సన్నివేశాన్ని ముగ్గురు కలిసి రీ క్రియేట్ చేశారు. బైక్ ఎక్కి సందడి చేస్తూ ఫోటో దిగారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక టీమ్ అంతా కలిసి ఓపెన్ గ్రౌండ్లో ఈ మూవీని చూశారు. నాని విజయ్ ఇద్దరు నవ్వుకుంటూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు.