nani upcoming movies : నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస చిత్రాలతో థియేటర్లో సందడి చేస్తున్నారు. ఓవైపు హీరోగా మరోవైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ మేప్పిస్తున్నారు. 2023లో హాయ్ నాన్న సినిమాలో సూపర్ హిట్ అందుకున్న 2024 లో సరిపోదా శనివారం మూవీలో హిట్ అందుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ ఆఫ్ చేశారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హిట్ సినిమాల సిరీస్లో ఇప్పటివరకు విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హిట్ 3 తో వస్తున్న శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఓ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో కనిపించనున్నాడు నాని. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
nani upcoming movies దసరా సినిమాతో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నాని శ్రీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్టుగా దసరా మూవీ నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ తో కలిసి సినిమా చేస్తున్నాడు నాని ఈ సినిమాకు “ది ప్యారడైజ్” అనే టైటిల్ ఇచ్చారు. తాజాగా సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
నాని మరోసారి తెలంగాణ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. దసరా సినిమాలో తెలంగాణ యాస లో మాట్లాడిన నాని ఇప్పుడు మరోసారి తెలంగాణ యాసలో తీస్తున్నాడు. తాజా గా విడుదలైన ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడియోలో వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ మూవీ త్వరలోనే క్రేజ్ అప్డేట్స్ ఇవ్వనున్నారు.

