ఎన్టీఆర్ దేవర మూవీ లేటెస్ట్ న్యూస్ : కొన్ని రోజుల నుంచి ఎక్కడ విన్నా ఎన్టీఆర్ గారి పేరు వినపడుతుంది. ఎందుకంటే ఈ నెల 27వ తేదీన ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ విడుదల కాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. అలాగే కొన్ని రోజుల నుంచి ఎన్టిఆర్ గారు పేరు వరుసగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది దేవర మూవీ యొక్క పోస్టర్ విడుదల తేదీ నుండి దేవర ట్రైలర్ వరకు దేవర మూవీ యొక్క ప్రతి విషయము ట్రెండింగ్ అవుతుంది.
తాజాగా వారం రోజుల క్రితం దేవర మూవీ మొదటి ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది . ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లడం మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను కలవడం. ఆ తర్వాత దేవర మూవీ ఇంటర్వ్యూ జరగడం. ఇలాంటి విశేషాలతో యంగ్ టైగర్ పేరు మీద X లో పోస్ట్ మరియు ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి ఎన్టీఆర్ గారు ముంబై వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులతో కలిసి సందడి చేయడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ అవుతున్నాయి.
అలాగే దేవర మూవీ ప్రమోషన్ లో భాగంగా నిన్న హైదరాబాదులో నోవేటల్ హోటల్లో భారీగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ కావడం జరిగింది ఎన్టీఆర్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారని కూడా చెప్పవచ్చు. అలాగే నిన్న దేవర మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది అలాగే దేవర మూవీ మీద అంచనాలను భారీగా పెంచింది.
నిన్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా గొడవ చేయడం జరిగింది. అలాగే NOVATAL HOTEL NU ధ్వంసం చేయడం జరిగింది. ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అదుపు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఎందుకు క్యాన్సల్ చేయడం జరిగిందో వీడియో రూపంలో అభిమానులకు చెప్పడం జరిగింది.
ఆ వీడియోలో ఎన్టీఆర్ గారు అభిమానం ఉద్దేశించి మాట్లాడుతూ .కొన్ని అనివార్య కారణాలవల్ల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం జరిగిందని అలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సల్ కావడానికి ఎవరిని నిందించవద్దని ఎన్టీఆర్ గారు అభిమానులను కోరడం జరిగింది. ఎన్టీఆర్ గారు ఇంకా వీడియోలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ. ఇవాళ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరగకపోయినా గానీ ఈ నెల 27వ తేదీన థియేటర్లోకి వచ్చి అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని మీకు తెలియజేస్తానని నా అభిమానుల అందరిని కాలర్ ఎగిరేసేలాగా మూవీ ఉంటుందని ఎన్టీఆర్ గారు అభిమానులకు చెప్పడం జరిగింది.ఎన్టీఆర్ దేవర మూవీ లేటెస్ట్ న్యూస్.
అలాగే ఎన్టీఆర్ గారు అభిమానం ఉద్దేశించి మాట్లాడుతూ తనను అందరి క్షమించాలని అలాగే ప్రతి ఒక్క అభిమాని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఎన్టీఆర్ గారు అభిమానులు చెప్పడం జరిగింది. నిన్న విడుదలైన దేవర మూవీ సెకండ్ ట్రైలర్ మాత్రం ప్రతి నిమిషం ఆసక్తికరంగా ఉంది ఈ ట్రైలర్ చూసినట్లయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం పక్కా అని తెలుస్తుంది.
ఇంకా దేవర మూవీని నిన్న కొంతమంది టాలీవుడ్ ప్రముఖుల కు చూపించడం జరిగింది.. ఆ మూవీని చూసినవారు దేవర మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ చెప్పడం జరిగింది. వారు చెప్పిన వివరాల ప్రకారము దేవర మూవీ చాలా బాగా ఉందని అందులో ఎన్టీఆర్ గారి నటనకు హై రేంజిలో పొగడ్తలు రావడం జరిగింది దేవర మూవీ చివరి 30 నిమిషాలు అదిరిపోయింది అని తెలుస్తుంది. ఇంకా ఈ మూవీ గురించి తెలుసుకోవాలంటే ఈనెల 27 తారీకు వరకు ఆగాల్సిందే.