ఎన్టీఆర్ దేవర మూవీ నెక్స్ట్ సాంగ్ అప్డేట్: దేవర మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా వస్తున్న భారీ చిత్రం/ ఇందులో నటించే జాహ్నవి కపూర్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. అలాగే ఇందులో విలన్ గా నటిస్తున్న కి ఇది మొదటి తెలుగు సినిమా. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత నటిస్తున్న చిత్రం కాబట్టి, దానితోపాటు కొరటాల శివ దర్శకత్వంలో వస్తుంది కాబట్టి మరియు జాన్వికాపూర్ మొదటి తెలుగు సినిమా కాబట్టి మరియు సైఫ్ అలీ ఖాన్ గారి మొదటి తెలుగు సినిమా మరియు విలన్ గా నటిస్తున్నాడు కాబట్టి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డబల్ రోల్ లో నటిస్తున్నారని తెలుగు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
దేవర సినిమా మొదలుపెట్టినప్పటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి దానితోపాటు ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దేవర సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఒక సాంగ్ కూడా విడుదలైంది ఆ సాంగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారి లుక్ జాహ్నవి కపూర్ లుక్కు మరియు ఆ సాంగ్లో హీరో హీరోయిన్ల డాన్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా గా ఉన్నారు. దేవర మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు మంచి బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి దీనితోపాటు అనిరుద్ ఇచ్చిన మొత్తం ఆల్బమ్ పై కూడా మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి మూడో సాంగ్ పై అంచనాలు మామూలుగా లేవు ఇక ఈ సాంగ్ పై లేటెస్ట్ మేకర్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రముఖ సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి పాటలు అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే మరి తన పుట్టినరోజు నేడు కావడంతో చిత్ర యూనిట్ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది అలా చేసి దేవర నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్ బిగ్ బ్లాస్ట్ గా నిలుస్తుంది అని అలాంటి పాటను రామ జోగయ్య శాస్త్రి గారు అందించారు అంటూ మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు ప్రస్తుతం మూడో పాటగా ఆయుధ పూజ రాబోతుంది అని ఆల్రెడీ తెలిసిందే దీని డేట్ కోసం మాత్రం ఇప్పుడు అంతా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మరియు ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్ వచ్చే సన్నివేశాలను సీట్ ఎడ్జిలో కూర్చొని చూడాల్సి వస్తుందని ఈ మూవీ మేకర్స్ తెలియజేయడం జరిగింది. దేవర నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మూవీ యొక్క అంచనాలను పెంచుతూ వస్తుంది రీసెంట్గా ఈ సినిమాలో విలన్గా నటించిన సైఫ్ ఆలీ ఖాన్ గారి లుక్కును మరియు టీజర్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దేవర మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. చూడాలి ఎన్టీఆర్ గారు దేవర మూవీతో ఎంత పెద్ద భారీ ఇంటిని సొంతం చేసుకోబోతున్నారు అని. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ గారు ఈ మూవీ గురించి చెబుతూ ఎన్టీఆర్ గారికి ఒక మైల్ స్టోన్ లాంటి మూవీ దేవర అని తెలియజేయడం జరిగింది.