Devara movie trailer : ఎన్టీఆర్ హీరోగా నటించే దేవర మూవీ ట్రైలర్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఎందుచేతనంటే రామ్ చరణ్ గారు రీసెంట్ గా నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్టుని సొంతం చేసుకోవడమే కాకుండా సుమారు 1400 కోట్ల రూపాయల వసులను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం కూడా జరిగింది ఇండియాలో ఏ సినిమాకు ఇంతవరకు ఆస్కార్ అవార్డు అనేది రాలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ గారు కూడా నటించడం జరిగింది. రామ్ చరణ్ ఎన్టీఆర్ గారి నటనకు ఈ సినిమాలో ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కి రామ్ చరణ్ గారికి అభిమానులు ఏర్పడడం జరిగింది.. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య కూడా పెరిగింది.
ఆర్ఆర్ ఆర్ మూవీ లో ఎన్టీఆర్ గారు చేసిన కొమరం భీం పాత్రకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడడం జరిగింది.. మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఎన్టీఆర్ గారికి ఈ సినిమాతో అభిమానులు ఏర్పడ్డారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు నటిస్తున్న మూవీ దేవర మూవీ .ఈ మూవీని ఓటమి అంటూ తెలవని కొరటాల శివ గారు దర్శకత్వం వహించడం ఇంకో ముఖ్యమైన విషయం గా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అందుచేత దేవర మూవీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
దేవర మూవీ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్కు మీద భారీగా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత దేవర మూవీ నుంచి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది ఈ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద భార్యా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టీజర్ లో కనిపించిన కొన్ని షాట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ గా అనిపించక మానదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్కును మరియు టీజర్ లోని ఎన్టీఆర్ ఫైట్స్ ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా భారీ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా లో హీరోయిన్గా నటించే జాన్వి కపూర్ మొదటి తెలుగు సినిమా. ఈ సినిమా లో జాన్వి కపూర్ గారి లుక్కుకు భారీగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా లో విడుదలైన పాటలో ఎన్టీఆర్ గారితో సమానంగా జాన్వి కపూర్ గారు డాన్స్ చేయడం కూడా ఎన్టీఆర్ అభిమానుల కు మాత్రమే కాకుండా తెలుగు అభిమానులు అందరికీ సంతోషాన్ని కలిగించిన విషయం.
స్ ఈ సినిమాలో ఇంకో చెప్పుకోదగిన విషయము ఏమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోలో ఒకరు అయిన సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గా నటించడం. ఇంతవరకు సైఫ్ అలీ ఖాన్ గారు హీరోగా నటించడం జరిగింది గాని విలన్ గా నటించడం ఇదే మొదటిసారి అది కూడా మన సౌత్ సినిమాలో. ఇది దేవర మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దేవర మూవీ గురించి కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అవి ఏమిటంటే .
జూనియర్ ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయని వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో నటిస్తున్నప్పుడు ప్రతి ఆడియన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే విధంగా సన్నివేశాలు మరియు యాక్షన్ సీన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ మాట సొరటాల శివ గారు చెప్పినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు మొత్తం తెలుగు ఇండస్ట్రీ అభిమానులు ఈ మూవీ గురించి ఎదురు చూడడం జరుగుతుంది. ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇప్పుడు ఒక భారీ న్యూస్ వచ్చింది. Devara movie trailer సెప్టెంబర్ 15వ తారీఖున విడుదల చేస్తారని న్యూస్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది అలాగే దేవర మూవీని సెప్టెంబర్ 27 తారీకు రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరుగుతుందని మూవీ టీం ఎప్పుడో ప్రకటించడం జరిగింది. ఈ మూవీ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ గారు ఎన్ని రికార్డులను బద్దలు కొడతారో చూడాలి. ఈ మూవీ ద్వారా మన తెలుగు ఇండస్ట్రీ యొక్క ఖ్యాతిని ఇంకొక మెట్టు దేవర మూవీ ద్వారా ఎన్టీఆర్ గారు ఎక్కిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.