onion oil for hair growth : మనిషి అందాన్ని నిర్వచించడంలో జుట్టు (Hair) కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తుగా, ఆరోగ్యంగా ఉన్న జుట్టు సహజం గానే అందాన్ని పెంచుతుంది. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం, వాతావరణ మా ర్పులు వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం (Hair Fall) సాధారణమైపోయింది. పాతికేళ్లకే బ ట్టతల స మస్యతో బాధపడుతున్నవాళ్లు మన చుట్టూ చాలామందే ఉన్నారు.
జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు మార్కెట్లో లభించే షాంపూలు, onion oil for hair growth హెయిర్ ఆయిల్స్ వాడు తున్న కొన్నిసార్లు అవే కొత్త స మస్యలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితు ల్లో ఇంట్లోనే సహజంగా తయారు చేసుకు నే ఉల్లి నూనె ( Onion Oil ) మంచి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉల్లి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు :
- జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది
- కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
- స్కాల్ప్ లో రక్త ప్రసరణ పెరుగుతుంది
- డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది
- జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది
ఉల్లి నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు :
how to make onion oil for hair growth :
- ఉల్లిపాయలు – 2
- నువ్వుల నూనె – 1 కప్పు
- కొబ్బరి నూనె – 1 కప్పు
కేవలం మూడు పదార్థాలతోనే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఉల్లి నూనె తయారీ విధానం :
- ముందుగా పెద్ద ఉల్లిపాయల ను తీసుకుని పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి
- ఆ ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి
- కావాలంటే కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేయవచ్చు
- స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఉల్లిపాయ పేస్ట్, మిగిలిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి బాగా కలపాలి
- పెద్ద మంటపై ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టి 30 నిమిషాలు మరిగించాలి
- ఉల్లిపాయలోని ఔషధ గుణాలు పూర్తిగా నూనెలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి
- నూనె పూర్తిగా చల్లారాక శుభ్రమైన గుడ్డతో వడకట్టి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచాలి
ఉల్లి నూనె ఎంతకాలం నిల్వ ఉంటుంది?
ఈ నూనెను ఫ్రిజ్‌లో ఉంచితే 3 నుంచి 4 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలా వాడాలి?
వారానికి 2–3 సార్లు తలస్నానం ముందు స్కాల్ప్‌కు అప్లై చేయాలి
30–40 నిమిషాలు మసాజ్ చేసి తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి.

