oscar winners best actress : ఆస్కార్ అవార్డులు.. రొమాంటిక్ మూవీ ప్రభంజనం….సినిమా రంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అవార్డు దీనికి అకాడమీ అవార్డు అని కూడా పేరు. ఈ ఆస్కార్ అందుకోవడం అనేది ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ కలగా ఉంటుంది గత కొన్ని రోజుల నుంచి మన దేశం ఎక్కువగా ఈ ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతుంది ఆర్.ఆర్.ఆర్ వంటి చిత్రాలు ఆస్కార్ అవార్డులను సాధించిన సంగతి తెలిసిందే. రెహమాన్ కైతే రెండు ఆస్కార్లు ఉన్నాయి.
హాలీవుడ్లో బిగ్గెస్ట్ వేడుక. ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్గా ఆరంభమైంది. ఇది 97వ ఎడిసన్ స్టార్ మూవీస్ సెలెక్ట్ స్టార్ మూవీస్ తో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేడుక. అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ రైటర్ టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియా ను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు తనదైన శైలిలో నవ్వులు పూయించారు.
ఉత్తమ క్యాస్టింగ్ డిజైను అవార్డును అమెరికాకు చెందిన టేజువెలు గెలుచుకున్నారు. విక్డ్ సినిమా ఆయనకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ది బెస్ట్ యానిమేటెడ్ ఫిచర్ ఫిలిం అవార్డు. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం అవార్డును ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రెస్ దక్కించుకుంది.
ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు కిరణ్ కూలికిన్స్. ది రియల్ పెయిన్ సినిమాలో ప్రదర్శించిన నటనకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. అవార్డుల జాబితాలో అనోరా ప్రభంజనం కనిపించింది మొత్తం 5 అవార్డు లు దక్కించుకుంది.
oscar winners best actress అనొరా లో క్యారెక్టర్ లో నటించిన మిక్కీమడిసన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సీన్ బేకర్ కు మూడు విభాగాల్లో పురస్కారాలు అనుకున్నాడు. ఉత్తమ దర్శకుడు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు అనొర కే దక్కాయి.
ఉత్తమ చిత్రం కేటగిరిలో అనోరాతో పాటు ఏమిలియా పేరేజ్ దీంతో పాటు ఇంకా చాలా సినిమాలు ఈ కేటగిరిలో అవార్డులు లభించాయి. బెస్ట్ ఫిలిం పురస్కారాన్ని అనోరా కైవసం చేసుకుంది.