400 గ్రామపంచాయతీలకి లక్షరూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం Pavan గారు ఏపీలో వరద బాధితుల సహాయం కోసం భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించడం జరిగింది Pavan గారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న 400 గ్రామపంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో పంచాయతీల విరాళం పంపిణీ:
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు సహాయమందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాలలో నిర్వహించనున్నారు ఇటీవల ఏపీ రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలకు మరియు వరదలలో చిక్కుకున్న ఆరు జిల్లాలలోని 400 పంచాయతీలకు ఈ విరాళం నేరుగా పంచాయతీలకే అందించే కార్యక్రమాన్ని నేడు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేయనున్నారు రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాలలోని పంచాయతీ సర్పంచులు మరియు కార్యదర్శికులు వచ్చి విరాళాన్ని అందుకోబోతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ సహాయం:
ఈరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్సురెన్సును నిర్వహించి వాళ్లకు తగిన సూచనలు కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే ఇతర నాయకులు ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ వరదల సమయంలో కొంత నిధులను మరియు పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాని తో కలిపి పంచాయతీలకు ఇవ్వడం గొప్ప విషయం అని ఈ సాయం ఎంత విలువైనదో అందరు గ్రహించాలని ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ సహాయం తో గ్రామపంచాయతీ ఉపయోగం:
తాను అందిస్తున్న సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ గారు యొక్క ఉద్దేశం అని నాదెండ్ల మనోహర్ గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిర్వహించే కార్యక్రమాలలో ప్రతిచోట ప్రోటోకాల్ ప్రకారం కూటమి నాయకులను కూడా ఆహ్వానించి అధికారులకు కూడా సమాచారం ఇచ్చి నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఎలాంటిదో అందరికీ ఇప్పటికైనా తెలియాలన్నారు నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రజల కష్టాల కోసం ఎంతైనా చేస్తారన్నది ఈ సందర్భంగా ప్రజలకు తెలుస్తుంది. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారు ఎంత నిజాయితీగా ప్రజలకు అండగా ఉన్నారనేది ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నాదెండ్ల మనోహర్ గారు ప్రజలను కోరడం జరిగింది అలాగే ఈ సమయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ గారు పార్టీ శ్రేణులను సూచించడం జరిగింది.
. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు మరియు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అందర్నీ సమిష్టిగా కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. వరద సహాయాన్ని నేరుగా అందించే ఈ కార్యక్రమంలో సర్పంచులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అందిస్తున్న ఈ సహాయాన్ని గ్రామ ఆస్తులు పరిరక్షణకు పారిశుద్ధ్యనికి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి ఇతర అవసరాలకు ఉపయోగించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ మరియు పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్ అంటున్న 400 గ్రామాల ప్రజలు:
మొత్తం 400 డ్రామా పంచాయతీలకు నేరుగా ఈరోజు పవన్ కళ్యాణ్ వరదహాయం అందించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయా గ్రామాల ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు ఇంతకుముందు ఎప్పుడు ఇలా పని చేసిన మంత్రిని ఇంతవరకు చూడలేదని ఆ డ్రామాల ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఒక్క నాయకుడైన ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకోవడం గమనార్ధం. ఈ సందర్భంగా జనసేన సైనికులు కూడా వరద బాధితులను ఆదుకోవడానికి తమ వంతు కృషి కూడా చేస్తున్నారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ గ్రేట్ ఎందుకంటే అందరి రాజకీయ నాయకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారి ప్రజలను ఆదుకునే మనస్తత్వం ఉండటం చాలా గ్రేట్. ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారి దారిలోన పయనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం