రుణమాఫీ కోసం Telangana ప్రజలు ఎదురుచూపులు

Written by 24newsway.com

Published on:

రుణమాఫీ కోసం Telangana ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. తెలంగాణలో లక్షలాదిమంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ మాత్రం రుణమాఫీ చేసినట్లుగా చెబుతుంది కానీ దీనిపై అన్నదాతలు మండిపడుతున్నారు. రుణమాఫీ సగం మంది రైతులకు మాత్రమే అయినట్లు తెలుస్తోంది .మిగతావారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారని తెలంగాణ రైతులు తెలంగాణ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం రుణమాఫీ చేస్తామంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది .కొంతమంది అన్నదాతలు తెలంగాణ సర్కారును తమ ఏమి తప్పు చేశామని నిలదీస్తున్నారు.

Telangana ప్రభుత్వం డిసెంబర్ వరకు రుణమాఫీ చేస్తామని చెబుతున్న గాని ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది .మరోవైపు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనేది స్పష్టత లేకుండా పోయింది . వానాకాలం సీజన్ ముగిస్తున్నా గాని ప్రభుత్వం రైతు భరోసా పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనితో రైతులలో ఆందోళన మొదలైందని చెప్పవచ్చు అలాగే రుణమాఫీ మరియు రైతు భరోసా అందక రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తోడు చాలా చోట్ల ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించలేదు దీంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వమును ఒక ఆట ఆడుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి అసలు పట్టించుకోవటం లేదని కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది.

ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి చేయాలనే బిజెపి రైతు హామీల సాధన దీక్ష చేసింది. అయినప్పటికీ  Telangana ప్రభుత్వంలో చరణం కనిపించడం లేదు .తాజాగా రైతు భరోసా పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన ఎక్స్ లో పోస్ట్ కూడా చేయడం జరిగింది . తెలంగాణ రైతులకు వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు ఇప్పుడు తెలంగాణ రైతులకు యాసంగి పెట్టుబడి సహాయానికి మంగళం పడేస్తారట . ఇంత దగా రేవంత్ సర్కార్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మన తెలంగాణ రైతులకు రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే కావచ్చు అని కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటుందా అని కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది .

రేవంత్ ఏడాది పాలన లో Telangana రైతుకు ఏడుపు తప్ప భరోసా లేనేలేదు అని రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది .ఇంకా కేటీఆర్ గారు మాట్లాడుతూ వానాకాలం పెట్టుబడి సహాయానికి మోక్షం అనేదే లేదు తెలంగాణ రైతులకు యాసంగి రైతు భరోసా కు దారే కనిపించడం లేదు రెండు లక్షల రుణమాఫీ పేరిట మోసం చేశారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడుతూ రైతుబంధును కూడా ఎత్తేస్తారా అలాగే అయితే తెలంగాణలో సాగు సాగేదెలా అని రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు ఇలా పోస్టుల తో దండయాత్ర చేశారని చెప్పవచ్చు.

ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ రైతుల గురించి ఆలోచించాలని రైతులకు కావలసిన రుణమాఫీ మరియు రైతు భరోసా త్వరగా చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. చూడాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తుందో అసలు పూర్తి చేస్తుందో లేదో.

Read More

Leave a Comment