Gas problems : గ్యాస్ సమస్యలు ఉన్నవారు వీటిని తిన కూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు ఏది పడితే తినకూడదు గ్యాస్ట్రిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది గ్యాస్ సమస్య ఉన్నవారు కొన్ని కూరగాయల్ని తినకపోవడం మంచిది. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ చెడు ఆహార ఆలవాట్లు కారణంగా చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇక టైంకి తినకపోవడం ఇష్టం వచ్చిన తినడం వల్ల చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు గ్యాస్ సమస్య ఉంటే ఉబ్బరం ఏది తినాలని అనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా తీవ్రమైన కడుపునొప్పి గుండెల్లో మంట కూడా వస్తుంది. అయితే ఈ గ్యాస్ సమస్య ఉన్నవారు ఏది పడితే తినకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు కొన్ని కూరగాయల జోలికి పోకపోవడం మంచిది.వీటిని ఎక్కువ తింటే మీ గ్యాస్ సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంతకీ ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందాం
వంకాయ
చాలామందికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం ముఖ్యంగా గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం ఇంట్లో వంకాయ కూర చేస్తే చాలా మంది ఇష్టంతో తింటారు. కొందరు వంకాయ పడదు మల్లబద్ధకం సమస్య ఉంటే మీరు వంకాయ ఎక్కువ తినడం మానుకోవాలి వంకాయ కూర తినడం వల్ల శరీరంలో గ్యాస్ దీంతో కడుపులో గ్యాస్ ఆమ్లత్వం ఏర్పడుతుంది. గ్యాస్ కడుపునొప్పి సమస్యలతో బాధపడేవారు ఇంకా దూరంగా ఉండాలి.
క్యాలీఫ్లవర్
క్యాబేజీ బ్రొకోలీ క్యాలీఫ్లవర్ ఇలా క్యాబేజీ రకాల కూరగాయ లో రఫీనోస్ ఉంటుంది. ఇది మీ శరీర బరువును పెంచుతుంది అంతేకాకుండా గ్యాస్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే ఈ కూరగాయల్ని పరిమితంగా తినాలి.
టమాట
ఈరోజుల్లో ఏ వంటలోనైనా సరే టమాట ఉండాల్సిందే టమాట లేకుండా కూరలు వండడం అసాధ్యం. అయితే టమాటా ఎక్కువగా తింటే గ్యాస్ ట్రిక్ లు సమస్యలు మల్లబద్ధకం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. టమాటా ఎక్కువగా తీసుకుంటే పొట్టలో గ్యాస్ ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.
బంగాళదుంపలు
మనలో చాలామంది బంగాలదుంపలను ఇష్టంగా తింటారు. బంగాళదుంపలతో సిప్స్ ఎక్కువ తింటారు. అయితే Gas problems గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంతో బంగాళదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల. ఎసిడిటీ గ్యాస్ సమస్య పెరుగుతుంది.
పన్నీర్
ఈరోజుల్లో చాలామంది పన్నీర్ని వంటల్లో ఉపయోగిస్తున్నారు పన్నీర్ బిర్యాని పన్నీర్ కుర్మా ఇలా డిఫరెంట్ వంటలు వండి తింటున్నారు అయితే పన్నీర్ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి పన్నీర్ ఎక్కువ తినడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుందని దీని ద్వారా మలబద్ధకం ఏర్పడుతుంది.
నిమ్మకాయ
పై చెప్పిన కూరగాయలతో పాటు గ్యాస్ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ ఎక్కువగా తీసుకోకూడదు నిమ్మకాయ జీర్ణ క్రియపై చెడు ప్రభావం చూపు అవకాశం ఉంది. అంతేకాకుండా నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయకు దూరంగా ఉండాలి అన్ని నిపుణులు తెలియజేస్తున్నారు.
గమనిక : ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించాలని ఉత్తమ మార్గమని గమనించగలరు