Kalki Movie టికెట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ లొల్లి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 చిత్రం ఈనెల 27వ తారీఖున గ్రాండ్గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం కూడా జరిగింది. ఈ kalki movie కి ఉన్న హైపు వల్ల బుకింగ్స్ కూడా ప్రారంభమైన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం కూడా జరిగిపోయింది .అయితే ఈ టికెట్స్ బుకింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయని ఫ్యాన్స్ చాలా ఆందోళన పడుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో యాంగ్రీ యంగ్ మాన్ గా పిలవబడే డాక్టర్ రాజశేఖర్ గారు మరియు రీసెంట్గా హనుమాన్ మూవీ తీసిన ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో కల్కి అనే సినిమా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా టికెట్లు బుక్ చేసుకోవాల్సింది పోయి చాలామంది తెలవని ఫాన్స్ చాలామంది పొరపాటున రాజశేఖర్ గారు నటించిన kalki movie కి బుక్ చేసుకోవడం జరుగుతుంది .దీంతో చాలామంది సినీ ప్రియులు సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా బుక్ మై షో స్పందించడం జరిగింది .సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయని దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని ప్రకటించడం జరిగింది రాజశేఖర్ గారు నటించిన కల్కి టికెట్లు ఇప్పటివరకు బుక్ చేస్తున్నా గాని ఆ టికెట్లన్నీ కల్కి 2898 టికెట్లు గా భావిస్తాం . మూవీ థియేటర్లోకి హా టికెట్ నే చూపించి ప్రభాస్ మూవీ కల్కి సినిమా కూడా చూడవచ్చు అంటూ బుక్ మై షో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది దీంతో ప్రవాస అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు కూడా చెప్పవచ్చు.
Kalki Movie టికెట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ లొల్లి
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఈనెల 27వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీం విడుదల చేసిన ప్రచార చిత్రాలు మరియు ట్రైలర్ ప్రజలను ఎంతో ఆకట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ మూవీ మీద ఆకాశాన్ని దాటాయి. కల్కి మూవీ ద్వారా మన తెలుగోని సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి నాగ అశ్విన్ గారు ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి గారు తెలుగని సత్తా ఇండియా మొత్తానికి తెలిసేలా చేశారు ఇప్పుడు నాగ అశ్విన్ వంతు చూడాలి కలికి సినిమా ద్వారా ప్రభాస్ ఎన్ని ప్రకంపనాలు సృష్టిస్తాడు. ఈ కల్కి మూవీలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ గారు మరియు కమలహాసన్ గారు దీపికా పదుకొనే గారు దిశాపటాని గారు మొదలగు భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది . ఈ మూవీను వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ గారు నిర్మించడం జరిగింది .ఈ సినిమా 600 కోట్ల పెట్టుబడితో ఇండియాలోనే హైయెస్ట్ కాస్ట్ మూవీ గా పేరు తెచ్చుకుంది.