prabhas latest movie news : బాధలో కూడా ప్రభాస్ సహాయం చేశారంటున్న సీనియర్ రచయిత….పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఇవన్నీ ఒక వైపు అయితే ప్రభాస్ మంచితనం గురించి అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా తోటి నటీనటులకు ఫుడ్ విషయంలోనే ఫుల్ ట్రీట్ ఇచ్చే ప్రభాస్ దానం విషయంలో కూడా ఎప్పుడు తన వంతుగా పాలుపంచుకుంటూనే ఉంటారు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదని నానుడిని నిజం చేస్తూ ఎవరుకీ తెలియకుండా ఆయన చేసిన దానాలు ఎన్నో ఉన్నాయి.
సినీ కార్మికులకు అభిమానులకు ఆపదలో సహాయం కోరిన ఎందరికో ఆయన సాయం చేశారని ఆలస్యంగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలానే ప్రభాస్ సాయం పొందిన వారిలో తాను ఉన్నానంటున్నారు ప్రముఖ రచయిత తోట ప్రసాద్. అంతటి దుఃఖంలో ఉండి కూడా ఆ రోజు ప్రభాస్ తన సహాయం చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు ఇప్పటికీ సహాయాన్ని మర్చిపోను అంటూ చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తోట ప్రసాద్ మాట్లాడుతూ ప్రభాస్ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఆయన నటించిన బిల్లా సినిమాకి నేను రచయితగా చేశాను ఆ కొద్దిపాటి పరిచయం తోనే ఆయన నాకు ఎప్పటికీ మర్చిపోలేని సహాయం చేశారు. నేను 2010లో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాను. అయితే నేను హాస్పిటల్ లో ఉన్న సంగతి తెలుసుకున్న ప్రభాస్ వైద్యానికి అవసరమయ్యే డబ్బు పంపించారు. అయితే చాలామంది మంచి మనసున్న వారు సాయం చేస్తుంటారు. కానీ నాకు సహాయం చేసిన రోజే ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కన్నుమూశారు.ఆ దుఃఖంలో కూడా ప్రభాస్ నాకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన గొప్ప మనసును చాటుకుంది. ఆ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటూ ఎమోషనల్ అయ్యారు. రచయిత తోట ప్రసాద్. ఆయన ప్రభాస్ నటించిన బిల్లా మూవీ కి తోట ప్రసాద్ రచయితగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు కన్నప్ప సినిమా ద్వారా ప్రభాస్ తో కలిసి పనిచేస్తున్నారు. తోట ప్రసాద్.
prabhas latest movie news : ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతితో రాజా సాబ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా సందీప్ రెడ్డితో స్పిరిట్ ఆ తర్వాత సాలార్ 2 కల్కి 2 చిత్రాలలో ఆయన నటిస్తున్నారు.