prabhas latest news

Written by 24 News Way

Updated on:

prabhas latest news : డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్క  సారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సాహో సినిమాతో తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సాలార్ కల్కి వరుస విజయాలతో తన స్టామినాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సాలార్ 2 కల్కి 2. సినిమాలో నటిస్తున్నారు.

దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయింది.ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఒక లుక్ వేస్తే ఆయన చాలా రిజర్వుడు ఉంటారు. కేవలం తన స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ కు తీవ్ర గాయం అయిందని వార్త సారాంశం.

ప్రభాస్ తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకి జారి పడటంతో కాలుకు తీవ్ర గాయం అయిందని అందుకే అతని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పోకుండా ప్రభాస్ పి ఆర్ టీం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేదా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కదలని స్థితిలో ఉన్నారని సమాచారం . బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ అనేక గాయాలు అయ్యాయి. అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐరన్ రాడ్ వేయడం జరిగింది.

prabhas latest news గతంలో గాయమైన చోటే ప్రభాస్ కు తిరిగి గాయం కావడంతో పాటు కాలు లో ఉన్న ఐరన్ రాడ్ బ్రేక్ కావడంతో సమస్య మరింత తీవ్రంగా అయిందని తెలుస్తుంది కాలు నరాలు దారుణంగా దెబ్బ తిన్నాయట. ఫిబ్రవరి 28న ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆస్పత్రిలో ప్రభాస్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ప్రభాస్ ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు. ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ప్రభాస ఆరోగ్యం పై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేను స్వామి ప్రభాస్ కు పెద్ద సర్జరీ జరిగిందని. అతని ఇండియాలోనే లేడని మీడియా సైతం ప్రభాస్ సర్జరీ జరిగిందనే విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారని వేణు స్వామి పేర్కొన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ప్రభాస్ కాలుకు సర్జరీ కావడం విశేషం. ప్రభాస్ కాళ్లకు గాయమైందనే విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమానం హీరో ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More>>

🔴Related Post