RajaSaab Movie లో త్రిబుల్ రోల్ చేస్తున్న Prabhas . ప్రభాస్ పేరు చెప్పగానే ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రభాస్ సినిమాలు అంటే పడిచస్తున్నారు జనం. ఏ ముహూర్తాన రాజమౌళి గారు ప్రభాస్ గారితో బాహుబలి సిరీస్ ను తీయడం స్టార్ట్ చేశారో గాని బాహుబలి సిరీస్ నుంచి ప్రభాస్ గారికి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు రావడమే కాక ఇండియన్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ అని తెలియజేసిన ఏకైక హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.
ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అంటే హిందీ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అంటే తెలుగు అని చెప్పడం మన అందరికీ చాలా గర్వకారణం. ఇంతవరకు ఏ తెలుగు హీరో సాధించలేని వసూళ్లను Prabhas తన సింగిల్ హ్యాండ్ తో సాధించి పెట్టాడు. ఇండియన్ ఇండస్ట్రీలో ఏ హీరో 1000 కోట్ల వసూలు సాధించలేనప్పుడే ప్రభాస్ గారు తన సినిమాలకు 1000 కోట్ల వసూల ను సాధించిన ఏకైక హీరోగా నిలిచారు. దట్ ఇస్ ప్రభాస్. ప్రభాస్ బాహుబలి సిరీస్ నుండి వరుసగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
Prabhas సినిమాల విషయానికి వస్తే బాహుబలి సిరీస్ తర్వాత సాహో అనే మూవీ చేయడం జరిగింది. సాహో సినిమా సౌత్ ఇండియాలో 55 గా ఆడినప్పటికీ నార్త్ ఇండియాలో మాత్రం దుమ్ము దులిపి వందల కోట్ల వసూలను సాధించి బాలీవుడ్ సినిమాల కన్నా ఎక్కువగా బస్సులను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. సహో తర్వాత వచ్చిన రాధాశ్యామ్ అన్ని ఇండస్ట్రీలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆది పురుషు చిత్రం కూడా అన్ని ఇండస్ట్రీలో అన్ని లాంగ్వేజీలలో ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సలార్ మూవీ మాత్రం అన్ని లాంగ్వేజ్లలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీనికి సుమారు 850 కోట్ల రూపాయల వాసులను సాధించి ప్రభాస్ కు మళ్లీ కం బ్యాక్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మూవీ అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచి సుమారు 1250 కోట్ల రూపాయల వసూలను సాధించి పెట్టింది. మళ్లీ ప్రభాస్ స్టామినా ఏమిటో తెలియ జేసింది.
ప్రభాస్ రీసెంట్ గా నటిస్తున్న మూవీ RajaSaab Movie .ఈ మూవీ నుండి దసరా రోజు ఒక అదిరిపోయే లుక్కును మూవీ టీం విడుదల చేయడం జరిగింది. ఆ లుక్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యేలాగా చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఈ మూవీ మీద ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే RajaSaab Movie లో ప్రభాస్ గారు త్రిబుల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.ఒకటి ప్రభాస్ గారి ఒక క్యారెక్టర్ మనవడిగా రెండో క్యారెక్టర్ తాతగా మూడో క్యారెక్టర్ దయ్యం గా చేస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండింగ్ లో ఉన్నది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు గాని ఈ వార్త మాత్రం నిజమైత మాత్రం రాజా సాబ్ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని అర్థం అవుతుంది.చూడాలి రాజా సాబ్ మూవీ విడుదలయ్యలోపు ఇంకా ఎన్ని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ బయటికి వస్తాయో.