prabhas raja saab movie release date : సాలార్ కల్కి మూవీస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం రాజా సాబ్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ. మొదట ఏప్రిల్ 2025లో విడుదల చేస్తామని ప్రకటించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో తేదీలు మార్చారు. ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక పుకార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలకు సంబంధించిన వార్త ఒకటి మీడియా సర్కిల్లో హార్ట్ టాపిక్ అవుతుంది.
హీరో ప్రభాస్ తీస్తున్న కొత్త మూవీలలో రాజా సాబ్ ఒకటి ఈ మూవీకి సంబంధించి మొదటిలో ప్రకటన వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ వద్దన్నారు కానీ తర్వాత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి హర్రర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ రాజా సాబ్ ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లోకి వస్తుందని ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఇంకా ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదు దీంతో వాయిదా పడటం గ్యారంటీ కొన్నాళ్ళ ముందు ఈ మూవీకి సంబంధించి టీజర్ వస్తుందని ఎంతోమంది ఫాన్స్ ఎదురు చూశారు. కానీ ఆ టీజర్ సంబంధించి ఎటువంటి అప్డేట్ రావటం లేదు.
prabhas raja saab movie release date ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని కానీ హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీ ఆలస్యం అవుతునే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి గత ఏడాది చాలా ప్లాప్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని అందుకే రాజా సాబ్ లేట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే రాజా సాబ్ పుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుందని.
కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పని ఉంటుంది అంటున్నారు. అలానే ఏడాది రాబోయే పండుగల కోసం కొత్త మూవీస్ రెడీ అవుతున్నాయి ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న రాజా సాబ్ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా వచ్చే ఏడాది అవుతుందా అని ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు.