prabhas rajasaab movie update : టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు సంపాదించుకున్నారు. సాలార్ కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో చూపించారు. నెక్స్ట్ సినిమాల లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం హాను రాఘవపూడి తో ఒక మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి తో స్పిరిట్, సలార్ టు, కల్కి టు, చిత్రాలతో నటించనున్నారు.
ప్రజెంట్ ఒ పక్క రాజా సాబ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో బ్యాలెన్స్ సూట్ కూడా కంప్లీట్ చేయాలని బిజీగా గడుపుతున్నారు. మరోపక్క తన డేట్స్ ని రాఘవపూడి డైరెక్షన్లో చేస్తున్న ఫౌజి సినిమాకి కూడా కేటాయించారు. అయితే వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతితో సినిమా చేయడం ఏంటని సర్వత్ర చర్చ నడుస్తోంది. మారుతి ప్రభాస్ ని హ్యాండిల్ చేయగలడా? సినిమా హిట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే రాజా సాబ్ సినిమా కూడా కమర్షియల్ గా బాగా వర్క్ అవుట్ అవుతుందని ప్రభాస్ ఆయన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. చాలా రోజుల తర్వాత అలాంటి సినిమా చేస్తున్నానని అంటున్నారట. నిజానికి ప్రభాస్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో కనిపించి చాలా కాలమే అవుతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
prabhas rajasaab movie update పాన్ ఇండియా మార్కెట్ ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నారని సినివర్గాల టాక్ నడుస్తుంది. కానీ రాజా సాబ్ సినిమాలో ఒక అదిరిపోయే ట్వీస్టు అయితే ఉందంట. ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుందని. దర్శకుడు గట్టిగా చెబుతున్నారట. స్క్రిప్ట్ లో చాలావరకు ట్విస్టులు ఉన్నప్పటికీ ఒక ట్విస్ట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందని దర్శకుడు చెప్పుకొచ్చారు. చూడాలి మరి మారుతి మేరకు మ్యాజిక్ చేస్తాడు చూడాలి.