Prashant Varma యూనివర్స్ లోకి లేడీ సూపర్ హీరో

Written by 24newsway.com

Published on:

Prashant Varma యూనివర్సిటీ లేడీస్ సూపర్ హీరో వచ్చేసింది. ఆల్రెడీ గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రశాంత్ వర్మ అక్టోబర్ 10 వ తారీఖున తన యూనివర్స్ చిత్రం గురించి అనౌన్స్ చేస్తాడని మనమందరం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే అది కూడా లేడీ సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నాడు అని కూడా మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హీరో చిత్రం వడానికి జరిగింది. మొదటగా సీనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ మ్యాన్ అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హీరో చిత్రాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. మళ్లీ ఇంత కాలానికి ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం ద్వారా తేజ సర్జను సూపర్ హీరోగా పరిచయం చేయడం జరిగింది.

Prashant Varma హనుమాన్ చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో గొప్ప పేరును తెచ్చుకోవడం జరిగింది. హనుమాన్ చిత్రం తెలుగులో ఎంత భారీ విజయన సాధించిందో అంతకంటే రెట్టింపు హిందీలో విజయం సాధించింది. దీనితో ఒక్క సినిమాతో ప్రశాంత వర్మ టాలీవుడ్ లో టాప్ దర్శకుల లో ఒకరిగా నిలవడం జరిగింది. హనుమాన్ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తన యూనివర్స్ లో మొత్తం 12 చిత్రాలు ఉంటాయని అవి అన్ని సూపర్ హీరో చిత్రాలని చెప్పడం జరిగింది.. అందులో భాగంగానే ఇవాళ ఉదయం ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి లేడీ సూపర్ హీరో చిత్రాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

అలాగే ప్రశాంత్ వర్మ అనుకునేట్టుగానే ఇవాళ ఉదయం ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి లేడి సూపర్ హీరో చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. ప్రశాంత వర్మ ఆ లేడీ సూపర్ హీరో చిత్రానికి గాను మహా కాళి అనే టైటిల్ న పిక్స్ చేసి తన హను మన్ యూనివర్స్ అనుసంధానం చేస్తూ ఒక వీడియోను రివిల్ చేయడం జరిగింది మరి దీనిపై వదిలిన అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్ గా అంచనాలను పెంచే విధంగా ఉన్నది అలాగే ఈ చిత్రాన్ని లేడీ దర్శకురాలు పూజ కొల్లూరు వర్క్ చేయనుండగా రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మాణం వహించడం జరుగుతుంది మరి ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ మునుముందు తెలియజేస్తామని చెప్పడం జరిగింది.

Prashant Varma ఇవాళ విడుదల చేసిన మహా కాళీ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ తోనే అంచనాలను భారీగా పెంచడం జరిగింది ఇంకా ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరో కూడా తెలియజేయలేదు. కానీ మహాకాళి మూవీ వీడియో చూస్తుంటే ప్రశాంత్ వర్మ చాలా భారీగానే ఏదో చేయబోతున్నాడు అని అర్థమవుతుంది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ప్రకటించిన తర్వాత ఈ మూవీ మీద అంచనాలు భారీగా పెరుగుతాయని తెలుస్తుంది. చూడాలి ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎన్ని అంచనాలను క్రియేట్ చేస్తాడు ఎలాంటి సూపర్ ఉమెన్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తాడో చూడాలి ఎందుకంటే ఇంతవరకు సూపర్ హ్యూమన్ సినిమాలు మనము హాలీవుడ్ లో మాత్రమే చూశాము. కానీ ప్రశాంత్ వర్మ వలన తెలుగులో కూడా ఒక సూపర్ ఉమెన్ చిత్రం రాబోతుంది. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సూపర్ ఉమెన్ చిత్రాన్ని తీసుకురాలేదు. దీనిని బట్టి చెప్పవచ్చు ప్రశాంతవర్మ తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాయపోతున్నాడు అని. చూడాలి ఈ సూపర్ ఉమెన్ చిత్రం విడుదల అయ్యేసరికి ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.

Read Movie

Leave a Comment