మరో SuperHero Movie ప్రకటించబోతున్న Prashanth Varma. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప దర్శకులు అనేక రకాల కథలను తెరకెక్కించడం జరిగింది..
మన తెలుగు సినిమా పాతకాలం దర్శకులు తెరకెక్కించిన పురాణాల ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు మనం చాలా చూశాం. ఒక విధంగా చెప్పాలంటే మన సౌత్ ఇండియాలో తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కించిన పురాణాల కథలతో ఉన్న సినిమాలు ఏ ఇండస్ట్రీ వాళ్ళు తెరకెక్కించలేకపోయారు. మనవాళ్లు అంత బాగా పురాణాలను చూపించడం జరుగుతుంది.. ఇక రీసెంట్గా నార్త్ ఇండియా వాళ్లు మన ప్రభాస్ హీరోగా ఆది పురుష్ చిత్రాన్ని తీయడం జరిగింది. అది ఎంత చెత్తగా ఉందో మనమందరం చూసాము. మన తెలుగు దర్శకులు దరికత్వం వహించిన శ్రీరాముని చిత్రాలు ఎంత బాగా ఉంటాయో చెప్పవచ్చు.. అందుకే సౌత్ ఇండియా వాళ్ళు జరగెక్కించిన పురాణ ఇతిహాస కథలు ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది.
అలాగే ఎవరు టచ్ చేయలేని ఇంతవరకు తెరకెక్కించలేని ఒక కాన్సెప్ట్ చిత్రాన్ని నూతన దర్శకుడు అయిన Prashanth Varma గారు తెరకెక్కించడం జరిగింది.. ఆ చిత్రం పేరు హనుమాన్. ఈ చిత్రంతో ప్రశాంత వర్మ పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది.. హనుమాన్ చిత్రం కథ పురాణాలను బేస్ చేసుకుని వచ్చిన ఒక సూపర్ హీరో కథ. ఈ హనుమాన్ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సాధించడమే గాక నార్త్ ఇండియ లో కూడా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. నార్త్ ఇండియన్స్ ఈ సినిమాను చూసి ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రాన్ని పోలుస్తూ రివ్యూలు చెప్పడం జరిగింది. హనుమాన్ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆది పురుష్ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ కన్నా హనుమాన్ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ చాలా బాగా ఉన్నాయని అలాగే హనుమాన్ స్టోరీ కూడా చాలా బాగా ఉందని సాక్షాత్తు ఇండియన్ ఆడియన్స్ చెప్పడం గమనార్ధం. లో బడ్జెట్లో తీసిన ఈ హనుమాన్ మూవీ నార్త్ ఇండియాలో వందల కోట్లు వసూలు చేసింది.
హనుమాన్ మూవీ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమా యూనివర్స్ లో మొత్తం 12 చిత్రాలు ఉన్నాయని ఒక్కొక్కటి ఒక సూపర్ హీరో చిత్రమని చెప్పడం జరిగింది అప్పటినుంచి ప్రశాంత వర్మ ఎప్పుడెప్పుడు సూపర్ హీరో చిత్రాల గురించి చెబుతాడు అని అందరూ ఎదురు చూడడం జరుగుతుంది. ఆరోజు రానే వచ్చిందని ఇప్పుడు మన తెలుస్తుంది. ఎందుకంటే హనుమాన్ మూవీ తర్వాత మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు తాను తొందరలోనే ప్రకటిస్తానని ప్రశాంత వర్మ చెప్పడం జరిగింది. అయితే రేపు అక్టోబర్ 10వ తేదీన ప్రశాంత్ వర్మ మారో అనౌన్స్మెంట్ ను అందిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అయితే ఇది కూడా సూపర్ హీరో సినిమా నే అని ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుంది కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈసారి ఒక ఫిమేల్ సూపర్ హీరో సినిమాని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది మరి రేపు ఇచ్చే అనౌన్స్మెంట్లో ఇది సూపర్ హీరో సినిమానా లేకపోతే మామూలు సినిమానా అనేది రేపు మనకు తెలుస్తుంది.