protect skin in summer : వేసవికాలం సమీపిస్తుంది ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోయాయి. ఎండాకాలంలో అధిక వేడిగాలులు ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగలడం డీహైడ్రేషన్ కు లోను అవ్వడం వంటి సమస్యలు జరుగుతుంటాయి. సరైన సమయంలో తగు జాగ్రత్తలు వహించాలి. వేసవికాలంలో చెమట చిరాకు వంటి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఎండలో బయటకు వెళ్లి వచ్చేసరికి చర్మ సమస్యలు తో బాధపడుతుంటాం. అయితే వేసవికాలంలో ఎటువంటి చర్మ సమస్యలు వస్తాయి చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ రక్షణ కోసం ఇలా చేయాలి
వేసవికాలంలో పగలంతా ఎండ నుంచి చర్మాన్ని కాపాడాలి అనుకునేవారు సూర్యుని ఎండ నుంచి నేరుగా గురికాకుండా చూసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లో సెన్స్ ఉపయోగించడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు క్యాప్ గాని గొడుగు గాని సన్ గ్లాస్ వంటివి ధరించడం చేస్తే సూర్యుని ఎండ నుంచి కాపాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణ కోసం ఎక్కువగా నీరు తీసుకోవాలి శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి.
చర్మాన్ని కాపాడుకోవడం
శరీరాన్ని హైడ్రేటుగా ఉంచుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మ ఆరోగ్యానికి తేలికపాటి మాయిశ్చరైజర్స్ వాడటం మంచిది చల్లటి నీళ్లతో స్నానం చేయాలి ఎండాకాలంలో రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం మంచిది చెమట ఎక్కువ పడుతున్నప్పుడు రెండుసార్లు స్నానం చేయడం అలాగే వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది ఎండాకాలంలో జిడ్డు కారం ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం చూసుకోవాలి.
ఆహారాలతో చర్మ రక్షణ protect skin in summer
మనం తీసుకున్న ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉంటే అది మన చర్మానికి మేలు చేస్తుంది ఇక రసాయనాలు ఎక్కువగా ఉండే సౌందర్య సాధనాలను ఉపయోగించకూడదు చర్మానికి సరిపడే ఉత్పత్తులను మాత్రమే చర్మ రక్షణ కోసం వాడాలి. ఇక ఎండకాలంలో మొఖం మీద వచ్చే మొటిమలను గిల్లటం వంటివి చేయకూడదు.
గమనిక ఈ కథనం వైద్యనిపులు సూచనలు మేరకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని మీ కొరకు అందించాం కాబట్టి ఏదైనా సమస్య ఉంటే దగ్గర్లో ఉన్న వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.