SSMB29 Update: రాజమౌళి మహేష్ సినిమాలో విలన్ గా స్టార్ హీరో. అదే జరిగితే మహేష్ బాబు రాజమౌళి సినిమా మరో ప్రభంజనం అవుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రంపై అభిమాన లా లో భారీగా అంచనాలను ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ పను లలో బిజీగా ఉన్నదని తెలుస్తుంది . అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది .ఈ సినిమాలో ఒక స్టార్ హీరో మహేష్ బాబు కి విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది ఇది గనక నిజమైతే మాత్రం మళ్లీ ఒకసారి తెలుగు సినిమా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడం గ్యారెంటీ. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
గ్లోబల్ రేంజ్ లో అడ్వెంచర్ డ్రామా గా ఎస్ ఎస్ ఎం బి 29 చిత్రం రాబోతుంది మహేష్ బాబు గారు రాజమౌళి కాంబినేషన్లో ఈ చిత్రం ఉంటుంది .ఈ చిత్రంలో విలన్ గా ఒక మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన సలార్ మూవీ లో హీరో పృధ్వీరాజ్ సుకుమార్ గారు ఒక ముఖ్య పాత్ర చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమై .ఈ సినిమా తో ఆయన పాన్ ఇండియా రేంజి లో పాపులర్ అయ్యాడు కూడా. ఇక ఇప్పుడు ఏకంగా రాజమౌళి గారి సినిమాలోనే ఆఫర్ కొట్టేశాడు అని తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట .అయితే ఈ విషయంపై రాజమౌళి గారు గాని పృథ్వీరాజ్ సుకుమారిన్ గారు గాని ఎటువంటి న్యూస్ బయటకు చెప్పలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి గారు పృథ్విరాజ్ సుకుమారన్ తో గత కొంతకాలంగా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై ఓ క్లారిటీ రావడంతో ఇద్దరూ అంగీకరించారని టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది అయితే ఈ విషయంపై అటు మూవీ మేకర్స్ నుంచి గాని ఇటు రాజమౌళి నుండి గాని పృధ్వీరాజ్ కుమార్ నుంచి గాని ఎటువంటి అధికారక ప్రకటన వెలువడలేదు.
పృధ్వీరాజ్ సుకుమార్ గారు చాలా కాలం నుంచి అన్ని భాషలలో నటిస్తూ వస్తున్నారు . ఒక విధంగా చెప్పాలంటే పృథ్వీరాజ్ సుకుమార్ గారు మలయాళంలో టాప్ హీరోగా ఉన్నప్పటి కీ తాను చేసే క్యారెక్టర్ లో వైవిధ్యం ని కోరుకుంటారు. పృథ్వీరాజ్ గారు హీరో గానే కాకుండా వీళ్ళనిగా కూడా చాలా సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం జరిగింది. పృథ్వీరాజ్ గారు తను నటించేది ఏ క్యారెక్టర్ అని చూడరు ఆ క్యారెక్టర్ లో తను ఎంతవరకు సూటవుతాను అని మాత్రమే చూస్తారు. అలాగే సలార్ సినిమాలో ప్రభాస్ గారికి దీటైన పాత్రలు నటించి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది.. సలార్ సినిమాలో ప్రభాస్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో పృధ్వి రాజు గారి కూడా అంతే పేరు వచ్చింది.. సినిమా తర్వాత పృధ్వీరాజ్ గారు నటించిన ఆడు జీవితము అనే మూవీ మలయాళం తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయినది. అయితే మలయాళంలో ఈ మూవీ సుమారు 150 కోట్లు వసూలు చేసి మలయాళం ఇండస్ట్రీ లో ఎక్కువ వసూలు చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది. దానితోపాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూలను సాధించి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
SSMB29 మహేష్ బాబు రాజమౌళి సినిమా
SSMB29 Update: మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని సుమారు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాలని రాజమౌళి గారు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రొడక్షన్ కంపెనీలతో కూడా ఆయన ఈ విషయమై చర్చించడం జరిగింది .ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గారు సరికొత్త లుక్కులో కనిపిస్తారని మనకు తెలుస్తుంది .ఇంతవరకు మహేష్ బాబు గారిని చూపించని లుక్కులో రాజమౌళి గారు చూపించాలని చూస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరో పృధ్వీరాజ్ గారి పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా 2025 లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక పృథ్వీరాజ్ గారు డిమాండ్ ఇటీవల బాగా పెరిగింది. పృథ్వీరాజ్ గారు కేవలం మలయాళం లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తో హీరో పృథ్వీరాజ్ గారు పాన్ వరల్డ్ రేంజిలో పేరు తెచ్చుకోబోతున్నారు అని మనం కచ్చితంగా చెప్పవచ్చు..