rajamouli upcoming movies mahabharata

Written by 24 News Way

Published on:

rajamouli upcoming movies mahabharata : దర్శకుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఎప్పటినుంచి మూవీ కోసం ఈ ప్రాజెక్టు కోసం చర్చలు నడుస్తున్నాయి అలాంటి సినిమా చేయాలంటే తనకున్న అనుభవం సరిపోదంటూ బాహుబలి కంటే ముందే చెప్పుకొచ్చారు అనంతరం తన డ్రీం ప్రాజెక్టు అని చాలా సార్లు చెప్పాడు ఈ ప్రాజెక్టు చేయడానికి ఒక భాగం రెండు కాదు నాలుగు ఐదు భాగాలు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.మహాభారతం నిర్మాణం మొదలైతే కొంతమంది స్టార్ హీరోలను కచ్చితంగా తీసుకుంటానని చెప్పాడు. రీసెంట్గా హిట్ 3 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గారు మాట్లాడుతూ ఈ హింట్ ఇచ్చాడు. రాజమౌళి గతంలో ఎన్నో ఇంటర్వ్యూలో ఈ మాట స్పష్టంగా చెప్పారు.

మహాభారతంలో కృష్ణుడు పాత్ర జూనియర్ ఎన్టీఆర్ను ఎంచుకుంటానని ఎన్టీఆర్ వంటి నటన ప్రతిభ ఆ గంభీరత్వాన్ని చమత్కారాన్ని సమర్థవంతంగా చేయగలడు అని తన అభిప్రాయం. అని రాజమౌళి చెప్పొచ్చారు.అలాగే మరో ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ కర్ణుడి పాత్ర కోసం ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని అతడి భిన్నమైన శైలి ఆ పాత్రకు సరిపోతుందని కర్ణుడిగా ప్రభాస్ ని చూడాలని ఉంది అని జక్కన్న తెలిపాడు.ఇటీవల హిట్ 3 ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ మహాభారతం మూవీ తీసినట్లైతే అందులో కచ్చితంగా నాని భాగమతారని చెప్పాడు ఈ విషయం నాని ఫాన్స్ ను ఆనంద పెట్టింది నాని లో ఉన్న నేచురల్ యాక్టింగ్ గుర్తించి రాజమౌళి ఇలా చెప్పడం గొప్ప విశేషం అయితే మహాభారతంలో ఎలాంటి పాత్ర ఉంటుందో చెప్పలేదు.

rajamouli upcoming movies mahabharata రాజమౌళి మహాభారతం చేస్తే అందులో శ్రీకృష్ణుడిగా జూనియర్ ఎన్టీఆర్ కర్ణుడిగా ప్రభాస్ మరో పాత్రలో నాని ఇలా ఉండే అవకాశం ఉంది ఈ మూవీ తీసినట్లైతే ఇండియన్ సినిమా చరిత్రలోనే గొప్ప మూవీ గా నిలిచిపోతుంది. రాజమౌళి మహాభారతం కోసం ఇంకా కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం రాజమౌళి హీరో మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

Read More>>

🔴Related Post