తెలుగు సినీ పరిశ్రమను గ్లోబల్ మ్యాప్‌పై నిలిపిన దర్శక దిగ్గజం s. s. rajamouli స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహు బలి, ఆర్ఆర్ఆర్ వరకు ఒక్క ఫ్లాప్ లేకుండా కెరీర్ కొనసాగిస్తూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించు కున్నా రు. మరో వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైలాగ్స్, కథనంతో కోట్లాది అభిమానులను సంపాదించు కున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ఒక్కటే ప్రశ్న రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న తెలుగు డైరెక్టర్ ఎవరు? ఈ చర్చకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి: హిట్లకు మారుపేరు అయిన దర్శకుడు
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం లోవచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనమే. s. s. rajamouli movies స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు Indian cinema స్థాయిని పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రేంజ్ మార్పు బాహు బలి ఒక సాధారణ సినిమా కాదు. అది ఒక pan India movie ట్రెండ్‌కు నాంది పలికింది. తెలుగు సినిమా కూడా హాలీ వు డ్ స్థాయి విజువల్స్ ఇవ్వగలదని ప్రపంచానికి చాటింది. ఆ సినిమాల box office collection లెక్కలు ఇప్పటికీ రి కార్డులుగానే ఉన్నాయి.
s. s. rajamouli upcoming movies :
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో “వారణాసి” అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. దాదాపు రూ.1200 కోట్ల తో ఈ సినిమా తెరకెక్కు తోంద న్న వార్తలు సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
స్టార్ క్యాస్టింగ్ హైలైట్ :
ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీతాని కి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి పని చేస్తున్నారు. ఈ కలయికే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
s. s. rajamouli net worth :
రాజమౌళి ఇప్పుడు ఫిక్స్‌డ్ ఫీజు తీసుకోవడం లేదు. సినిమా లాభాల్లో షేర్ తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారు. కొన్ని ఏరియా హక్కులు కూడా ఆయన దగ్గరే ఉంటాయనే టాక్ ఉంది. ఇలా ఒక్క సినిమాకు ఆయనకు దాదాపు రూ.250 కోట్ల వరకు వస్తాయని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇండియాలోనే టాప్ డైరెక్టర్?
ఈ లెక్కన చూస్తే director remuneration విషయంలో రాజమౌళి ఇండియాలోనే టాప్‌లో ఉన్న దర్శకుడిగా నిలుస్తున్నారు. ఒకే సినిమాతో అంత మొత్తం రావడం అంటే చిన్న విషయం కాదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్: మాటల మాంత్రికుడి మల్టిపుల్ ఇన్‌కమ్
త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అరవింద సమేత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా డైలాగ్స్ ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. డైరెక్టర్ మాత్రమే కాదు, రైటర్ కూడాత్రివిక్రమ్ తన సినిమా లకు మాత్రమే కాకుండా ఇతర సినిమాలకు కూడా రచయితగా పని చేస్తూ మంచి ఆదాయం సంపాది స్తున్నా రు. ఇది ఆయనకు అదనపు ఇన్‌కమ్ సోర్స్‌గా మారింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో భాగస్వామ్యం :
త్రివిక్రమ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భాగస్వామిగా ఉన్నారు. ఈ బ్యానర్‌లో సినిమాల కథలు, ప్రాజెక్ట్ ప్లానింగ్ వరకు ఆయన కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. Pavan Kalyan కోసం కథలు వినడం, స్క్రిప్ట్ వర్క్ చేయడం ద్వారా కూడా ఆయనకు ఆదాయం వస్తుందనే టాక్ ఉంది.
ఏడాదికి రూ.150 కోట్లు?
సోషల్ మీడియా కథనాల ప్రకారం త్రివిక్రమ్ ఏడాదికి సుమారు రూ.150 కోట్ల వరకు సంపాదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్ షేర్ అన్నింటినీ కలిపిన మొత్తం అని అంటున్నారు.
రాజమౌళి vs త్రివిక్రమ్: ఎవరు ఎక్కువ?
ఒక్క సినిమాకి vs ఏడాదికి
రాజమౌళి ఒక్క సినిమాకు సుమారు రూ.250 కోట్లు సంపాదిస్తున్నా, ఆయన సినిమాలు నాలుగైదేళ్లకు ఒకసారి మాత్ర మే వస్తాయి. కానీ త్రివిక్రమ్ ప్రతి ఏడాది సినిమాలు, స్క్రిప్ట్ వర్క్, ప్రొడక్షన్ ద్వారా నిరంతరం ఆదాయం పొం దుతు న్నారు. లెక్కల తేడానే చర్చకు కారణం మొత్తం కెరీర్ పరంగా చూస్తే రాజమౌళి బ్రాండ్ విలువ చాలా ఎక్కువ. కానీ సంవత్సరా నికి వచ్చే ఆదాయం పరంగా చూసినప్పుడు త్రివిక్రమ్ ముందుండవచ్చనే చర్చ జరుగు తోంది. అందుకే Tollywood లో ఈ ఇద్దరి మధ్య పోలిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇద్దరూ తమ తమ స్థాయిలో నంబర్ వన్:
రాజమౌళి గ్లోబల్ లెవెల్ దర్శకుడిగా తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. త్రివిక్రమ్ మాత్రం కంటెంట్, మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారనే చర్చ కంటే, ఇద్దరూ తమ తమ స్టైల్‌లో ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారన్నదే అసలు నిజం.మీ అభిప్రాయం ప్రకారం రాజమౌళి బ్రాండ్ గొప్పదా? లేక త్రివిక్రమ్ మల్టిపుల్ ఇన్‌కమ్ మోడల్ స్ట్రాంగ్ అనిపిస్తుందా?

