మొదలైన రాజాసాబ్ టీజర్ హంగామా

Written by 24newsway.com

Published on:

rajasaab-teaser-released : మొదలైన రాజాసాబ్ టీజర్ హంగామా. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న rajasaab-teaser రాబోతుంది. బాహుబలి సినిమా  తర్వాత హీరో ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తుండడం మనము చూస్తూనే ఉన్నాము. ప్రభాస్ సినిమా అంటే మినిమం 500 కోట్ల బడ్జెట్ 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం హీరో ప్రభాస్ కి మామూలు అయింది.

బాహుబలి సినిమా తర్వాత హీరో ప్రభాస్ నటించిన సాహో మరియు రాధా శ్యామ్ మరియు ఆది పురుష్ చిత్రాలు కొంచెం నిరాశపరిచిన గాని ప్రభాస్ కు ఏ విధమైన డ్యామేజీ జరగలేదు. సాహో సినిమా మాత్రం తెలుగులో అంతగా అడగకపోయినా గానీ నార్త్ ఇండియన్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూడు చిత్రాల తర్వాత వచ్చిన సలార్ మొదటి పార్ట్ సుమారు 750 కోట్లు వసూలు చేసి ప్రభాస్ స్టామినా ఏందో మళ్లీ అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ సుమారు వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు వసూలు చేసి ప్రభాస్ స్టామినా ఏమిటో మళ్లీ అందరికీ తెలిసేలా చేసింది.

కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో మొదటగా ప్రకటించిన రాజాసాబ్ ఈ సంవత్సరం చివరలో రాబోతుంది. ఆ తర్వాత పాజి చిత్రాన్ని ఇప్పుడు ప్రభాస్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో చేసే స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. ఇలా ప్రభాస్ నిమిషం కూడా కాళీ లేకుండా బిజీ షెడ్యూల్ ముందుకెళుతున్నాడు.

rajasaab-teaser-released:

ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ నెల 16న ది rajasaab-teaser లాంచ్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. టీజర్ లంచ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే విషయం ఐమాక్స్ దగ్గర 36 అడుగుల ప్రభాస్ కటౌట్ ని పెట్ట బోతున్నారట ఈ విషయం తెలిసినప్పటినుంచి ప్రభాస్ అభిమానులు ఒక రేంజిలో పండగ చేసుకోవడం జరుగుతుంది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రభాస్ అభిమానులు కూడా ఓ రేంజ్ లో నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అందరూ రాజా సాబ్ హంగామా మొదలైంది అంటూ యాష్ ట్యాగ్ తో మెసేజ్ లతో హంగామా చేస్తున్నారు . ప్రభాస్ అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులు కూడా ప్రభాస్ ను తమ హీరో లాగానే చూస్తూ ఉంటారు. అలా అందరి హీరోల అభిమానులను కూడా తన మంచి మనసుతో గెలుచుకోవడం మన ప్రభాస్ కి చెందింది.

Read Movie

🔴Related Post