ram charan and dhoni news update : రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్ సి 16 అని స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ రంగస్థలం తర్వాత మళ్లీ ఒక మాస్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథను ఎంచుకోవడం. ఇందులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉండడం వల్ల ఈ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. అలాగే ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు శివ రాజ్ కుమార్ జగపతిబాబు ఉండటం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లేలా ఉంది.
ఈ సినిమాకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ప్రేక్షకులు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆర్సి 16 కోసం పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. అనే టాక్ ఉంది ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ram charan and dhoni news update ఇదిలా ఉండగా ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గెస్ట్ రోల్ చేయనున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. కొన్ని కథనాలు ధోని రామ్ చరణ్ కోచ్ గా కనిపిస్తాడని పేర్కొన్నాయి. నిజానికి ధోనికి అలాగే రామ్ చరణ్ కు మంచి స్నేహం ఉంది. హైదరాబాద్ కు వస్తే ధోని రామ్ చరణ్ కూడా కలుస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నిజంగా కోచ్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ పాత్రను ధోని పోషించడం లేదు. ధోని ఇప్పటివరకు సినిమాలో నటించలేదు అయితే అతను సినిమా నిర్మాణంలో మాత్రం బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఇక సిని రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలకు వచ్చారు. మరోవైపు ఆర్ సి 16 షూటింగ్ వేగంగా సాగుతోంది.
బుచ్చిబాబు సహజమైన వాతావరణాన్ని చూపించేందుకు ఎక్కువగా అవుట్ డోర్ లోకేషన్ లో ఎంచుకుంటున్నట్లు సమాచారం. అందులో రామ్ చరణ్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని టాక్. ఈ మూవీను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు భారీ బడ్జెట్తో తర్కెక్కుతున్న ఏ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ధోని వార్తలు నిజం కాకపోయినా సినిమా మీద అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.