ram charan buchi babu movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా తో ఈ మూవీ తెరకెక్కుతుందని. తెలిసిన విషయమే మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో శివ రాజ్ కుమార్ జగపతిబాబు వంటి నటులు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాదులో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ క్రికెట్ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో మార్చి తొలి వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ కుస్తి నేపద్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ram charan buchi babu movie : కథకు సంబంధించి ఈ సినిమాలో క్రికెట్ కుస్తీ తోపాటు మరి కొన్ని క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుందని సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి “పెద్ది” అనే టైటిల్ తో పాటు మరో రెండు పేర్లు పరిశీలన లో ఉన్నట్లు సమాచారం. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏమిటంటే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ ను టీజర్ ఈ రెండిటిని ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఈ మూవీ కోసం సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతుంది.
ఇది ఇలా ఉండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాలతో విడుదల అయింది. ఎవరు ఊహించని విధంగా గేమ్ చేంజెస్ మూవీ మిక్స్ డు టాక్ సొంతం చేసుకుంది. అయినా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఓపెనింగ్ రాబట్టి ంది కానీ ఆ తర్వాత అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది క్రమంగా వసూలు తగ్గుతున్నాయి.గేమ్ చేంజర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు.

