ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న Ramcharan

Written by 24 News Way

Published on:

ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న Ramcharan గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 తొ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్  జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సెట్లో నా చిన్నారి అతిథి. RC16 అని కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు Ramcharan. అయితే ఆ చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. హీరోగా రామ్ చరణ్ 16వ చిత్రమిది. అందుకని ఆర్సి 16 వర్కింగ్ టైటిట్తో అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జూబ్లీహిల్స్ లో జరుగుతోంది. మెగా ఫ్యామిలీ ఇంటికి ఆ లొకేషన్ చాలా దగ్గర. అందుకే చిత్రీకరణ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు ఉన్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్ సైతం లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన ఉపాసన కామెంట్ చేసింది. ఫోమో అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.  కాగా.. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఇక్కడ Ramcharan పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో  హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ  నిర్మిస్తున్నారు.

క్లీంకార కొణిదెలమెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన దంపతుల గారాల కూతురు. ఆ చిన్నారి ఎలా ఉంటుందో చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలోనూ ఆసక్తి ఉంది. చిన్నారిని మనకు చూపించలేదు కానీ… ఆ చిన్నారికి షూటింగ్ ఎలా జరుగుతుందో చూపించారు రామ్ చరణ్.

RC16 చిత్రీకరణకు వచ్చిన క్లీంకారా కొణిదెల

రామ్ చరణ్కథానాయకుడిగా దర్శకుడిగా పరిచయమైన ‘ఉప్పెన’ సినిమాతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక సెట్ నందు చిత్రీకరణ జరుగుతోంది. షూటింగుకు కుమార్తెను తీసుకు వెళ్లారు రామ్ చరణ్.

ఇటీవల ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి చీఫ్ గెస్టుగా హాజరైన రామ్ చరణ్.. క్లీంకార తనను నాన్న అని పిలిచే వరకూ కుమార్తె ఫేస్ చూపించనని అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు తన కుమార్తె ముఖం కనిపించకుండా బ్యాక్ సైడ్ లుక్ నే ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. అయినా సరే ఈ పిక్ మెగా అభిమానులకు ఆకర్షిస్తోంది. గ్లోబల్ స్టార్ తో కలిసి లిటిల్ ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read>>

🔴Related Post