ramcharan latest movie news : రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఈసారి అంతకు మించిన విజయాన్ని దర్శించుకోవడం ఖాయం అని నమ్మకంతో ఉన్నారు. పైగా గేమ్ చెంజర్ లాంటి చిత్రం. తర్వాత రామ్ చరణ్ కి పక్కగా హిట్ పడాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో… ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ మన బుచ్చన్న మూవీ పైనే ఉన్నాయి.
ఈ తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో జోస్ నీ నింపుతున్నాయి. ఉప్పెన సినిమాతో దర్శకుడుగా పరిచయమైన బుచ్చిబాబు. రెండో సినిమాని రామ్ చరణ్ తో చేసే అవకాశం దక్కించుకున్నారు. చాలా కాలమైన స్టార్ హీరో తో సినిమాలు చేయాలని ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పటికీ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పట్టాలెక్కింది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి రామ్ చరణ్ లుక్ తో పాటు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
తాజాగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ అనుమానం అక్కర్లేదు సినిమా గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుంది.
బ్రహ్మాజీ ముఖ్యపాత్రలో నటించిన బాపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కల్కి చిత్ర దర్శకుడు తో పాటు బుచ్చిబాబు సైతం పాల్గొన్నారు. ఆ సమయంలో బుచ్చిబాబు మాట్లాడుతూ మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆయన మా నుండి దూరమై సంవత్సరం అవుతుంది. మొదటి సినిమా ఉప్పెన విడుదల సమయంలో నాన్న థియేటర్ ముందు వచ్చి వెళ్లే వాళ్ళని సినిమా బాగుందా అని అడిగేవారట. ఆయన సినిమా చూడకుండానే ప్రేక్షకుల అభిప్రాయాన్ని అడిగేవారు.
ramcharan latest movie news : కానీ ఈసారి అవసరం లేదు ఈసారి రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాను పక్కాగా బాగుంటుంది మూవీ హిట్టు కొడుతుంది. సినిమా బాగుందా అడగవలసిన అవసరం లేదు గ్యారెంటీగా హిట్ అవుతుంది అని అన్నారు.దర్శకుడు బుచ్చిబాబు ఒకే సినిమా చేసినప్పటికీ ఆయనపై చాలా నమ్మకం పెట్టి రాంచరణ్ మూవీ చేస్తున్నారు.గురువు సుకుమార్ కి ఏ మాత్రం తగ్గకుండా ఫిలిం మేకింగ్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.తాజాగా బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలు మరింత పెంచాయి రంగస్థలంలో చిట్టిబాబు వంటి లుక్ లో రామ్ చరణ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మరోసారి బుచ్చిబాబు సినిమాలో కనిపించబోతున్నారని సమాచారం.మనకు అందింది అతి త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది అని తెలుస్తుంది.