ramcharan latest news rc 16 : రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీ RC 16 ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు గతంలోని పలుసార్లు విశాల్ దర్శకుడు బుచ్చిబాబు చెప్పుకొచ్చారు ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతిని ఈ విభిన్నమైన పాత్రలో చూపించిన బుచ్చిబాబు RC 16లో శివకుమార్ను ప్రత్యేకమైన పాత్రలో చూపించబోతున్నారు తాజాగా శివరాజ్ కుమార్ కి లుక్ టెస్ట్ జరిగింది లుక్కు ఫైనల్ కావడంతో అతి త్వరలోనే ఆర్సి 16 షూటింగ్లో శివరాజ్ కుమార్ పాల్గొనబోతున్నాడు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాటం చేసి కోరుకున్నారు గత ఏడాది చివర్లో శివరాజ్ కుమార్ కి క్యాన్సర్ సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స జరిగిన కొన్ని రోజులకే శివకుమార్ అభిమానులకి తను బావున్నాను అంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాన్సర్ని జయించిన శివరాజ్ కుమార్ కెమెరా ముందుకు రావడానికి కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం తీసుకుంటారని అంతా అనుకున్నారు కానీ మూడు నెలల్లోనే సినిమా షూటింగ్లో పాల్గొనటానికి ముందుకు రాబోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న RC 16 షూటింగ్లో ఈ నెలలోనే శివ రాజ్ కుమార్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.
ఇటీవల బుచ్చిబాబు తన టీం తో కలిసి బెంగళూరులోని శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి మరీ లుక్ టెస్ట్ చేశారు తన సినిమాలోని పాత్రకి తగ్గట్లుగా మేకప్ చేసి బుక్ టెస్టు చేశారు. మేకప్ తోనే విభిన్నమైన గెటప్ లో శివరాజ్ కుమార్ కనిపించబోతున్నాను తెలుస్తుంది లుక్ టెస్ట్ పూర్తయిందని. త్వరలోనే శివరాజ్ కుమార్ RC 16 షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టుగా అధికారికంగా ఒక వీడియోను విడుదల చేశారు ఈ వీడియోలో బుచ్చిబాబు స్వయంగా శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి దగ్గరుండి మేకప్ చేయడంతో పాటు ఫోటో షూట్ చేయించారు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ బుచ్చిబాబు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ramcharan latest news rc 16 స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుంది. అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆ సందర్భంగా RC 16 ఫస్ట్ లుక్ ను రివిల్ చేయడంతో పాటు సినిమా టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ పర్సన్ గా బుచ్చి బాబు చాలా విభిన్నంగా చూపించబోతున్నారని. సమాచారం అందుతుంది. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ తన ఫిజిక్స్ మల్చుకుంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా రామ్ చరణ్ పక్కన నటిస్తున్న హీరోయిన్ జాన్వి కపూర్.
RC 16 సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి సినిమా ప్రకటన వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ ఎక్కువ డేట్స్ ఇచ్చారు దీంతో కొద్దిగా ఆలస్యం అయింది. దీనివలన బుచ్చిబాబుతో తీయవలసిన సినిమా కొద్దిగా ఆలస్యం అయినా ప్రారంభమైన తర్వాత మాత్రం ఎప్పుడూ ఆలస్యం కాలేదు షూటింగ్ స్పీడ్గా చేస్తున్నాను. ఇదే ఏడాది చివరిలోగా ఈ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు ఈ మూవీని మైత్రి మూవీ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.