RC 16 Movie Update

Written by 24 News Way

Published on:

RC 16 Movie Update : ఆర్ సి 16 update గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం సరికొత్త లుక్ లో హీరో కనిపించబోతున్నారు. జాన్వికపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పటికే షెడ్యూల్ పూర్తయింది. ఈ మూవీకి సంబంధించి రెండవ షెడ్యూల్ తీయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కోసం రజినీకాంత్ టీం దిగింది.

తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ కోసం రజనీకాంత్ టీం రంగంలో దిగిందని. యాక్షన్ డైరెక్టర్ కెవిన్ కుమార్ ఆర్ సి 16 సినిమాల్లో మాసివ్ ఫైట్ సీక్వెన్స్ తెరక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన రజనీకాంత్ తో కలిసి పని చేశారు. అప్పటి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. జైలర్ మూవీలో రజినీకాంత్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. వాటిని కెవిన్ కుమార్ యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కోసం రంగంలోకి కెవిన్ కుమార్ యాక్షన్ డైరెక్టర్ గా దిగడంతో ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RC 16 Movie Update ఆర్ సి 16 షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఈ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆలోచనతో హీరో రామ్ చరణ్ ఉన్నారు. ఆగస్టులోగా ఈ మూవీని పక్క ప్లాన్ తో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ వేస్తున్నారు. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చిన చిత్ర యూనిట్ తిరిగి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసింది. హైదరాబాదులోని బూత్ బంగ్లాలో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇటీవల శివరాజ్ కుమార్ కు సంబంధించి టెస్టు లుక్ కూడా కంప్లీట్ చేశారు.

అలాగే జాన్వి కపూర్ బర్త్ డే సందర్భంగా ఆర్ సి 16 టీం బి టి ఎస్ పోస్టర్ను షేర్ చేయగా ఇది వైరల్ అయింది. ఇక సినిమాను వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీలో జగపతిబాబు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. రత్న వేలు కెమెరామెన్ గా ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు.

Read More>>

🔴Related Post