rc 16 movie update : హీరో రామ్ చరణ్ భారీ అంచనాలతో తీయబోతున్న మూవీ ఆర్ సి 16 ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి ముందు తీసిన మూవీ గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈసారి తీయబోయే మూవీతో భారీ విజయనందుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్. అందులో భాగంగానే బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు దీంతో ఈ సినిమాపై ఇంకా భారీ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్న వీడియోను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ అర్ధరాత్రి కూడా జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక తాజా షెడ్యూల్లో భాగంగా హీరో చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఇప్పటికే శివరాజ్ కుమార్ తన పాత్ర కోసం టెస్ట్ కూడా చేశారని. త్వరలోనే ప్రారంభంగానున్న కొత్త షెడ్యూల్లో ఆయన భాగం కాబోతున్నట్లుగా సమాచారం.
rc 16 movie update ఇక ఇలా భారీ అంచనాలతో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ ఇందులో క్రికెట్ ప్లేయర్గా కుస్తీ ఆటగాడిగా కూడా పలు రకాల ఆటోలు వచ్చిన యువకుడిగా కనిపించనున్నారట. దీంతో రాంచరణ్ పాల్గొన్న క్రికెట్ మ్యాచ్ సంబంధించి షూటింగ్ సన్నివేశాలు పూర్తి చేశారు ఈ సమయంలో ఎవరో తమ సెల్ ఫోన్ తో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్న వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మొత్తానికైతే సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియో చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ వీడియోలో ఒక మైదానంలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏదిఏమైనా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీ రామ్ చరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ మూవీలో జగపతిబాబు మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫ్రేమ్ దివ్వెందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ వర్క్ చేస్తున్నారు.