అత్యవసర పరిస్థితులలో మనల్ని కాపాడే మందులు ఇవే గుర్తుపెట్టుకోండి

Written by 24newsway.com

Updated on:

అత్యవసర పరిస్థితుల్లో మందులు: అత్యవసర పరిస్థితుల్లో మనల్ని కాపాడే మందులు ఇవే. అత్యవసర పరిస్థితుల ఎప్పుడూ ఎక్కడ ఎలా ఏర్పడతాయో చెప్పలేము అటువంటి సమయాల్లో మనకు అత్యవసరంగా అవసరమైన మందులు అయితే అయితే ప్రతి ఇంటిలో అన్ని రకాల మందులు ఉండాలని లేదు కొన్ని ముఖ్యమైన మందులు మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడున్న జీవనశైలిలో 50 సంవత్సరాలు రావాల్సిన షుగర్ బిపి 25 సంవత్సరాలకే వస్తున్నాయి దీనిని మీరు అందరు గమనించగలరు . ఆరోగ్య విషయంలో ఆ జాగ్రత్త వద్దు . ఈ మందులతోనే ఆరోగ్యం కాపాడుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం చాలా మంచిది .

ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన తక్షణ చికిత్స చేయడానికి మనం ఉంచుకున్న మందులు ఉపయోగపడాలి. అయితే ప్రతి వ్యక్తికి వేరువేరు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఏ మందులు ఉంచుకోవాలో నిర్ణయించడానికి ముందు మీ కుటుంబ వైద్యుని సలహా తీసుకోవడం చాలా మంచిది.

సాధారణంగా ప్రతి ఇంటిలో ఉంచుకోవాల్సిన మందులు

జ్వరం, మరియు నొప్పులు: పారాసెటమాల్ (Paracetamol) లేదా ఇబుప్రోఫెన్ (Ibuprofen) వంటి మందులు.

అలర్జీలు వచ్చినప్పుడు వాడే మందులు : యాంటీహిస్టామైన్ (Antihistamine) మాత్రలు లేదా క్రీములు.

అజీర్తి వేసినప్పుడు వాడే మందులు : యాంటాసిడ్ (Antacid) మాత్రలు.

మలబద్ధకం వచ్చినప్పుడు వాడే మందులు : ల్యాక్సటివ్ (Laxative).

బ్యాండ్-ఎయిడ్స్ : చిన్న గాయాలకు.

యాంటీసెప్టిక్: గాయాలను శుభ్రపరచడానికి.

ఇటువంటి మందులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ఉండవలెను.

ఇవి మాత్రమే కాకుండా అదనంగా కింద చూపించిన పరిస్థితులు ఉన్నవారు ఈ మందులను కూడా తమ వద్ద ఉంచుకోవడం మంచిది.

షుగర్ వ్యాధి ఉన్నవారు : ఇన్సులిన్ లేదా ఇతర షుగర్ మందులు.

అధిక రక్తపోటు ఉన్నవారు వాడే మందులు : రక్తపోటు మందులు.

ఆస్తమా ఉన్నవారు తీసుకునేది : ఇన్హేలర్.

హృదయ సమస్యలు ఉన్నవారు తీసుకోవలసినది : నైట్రోగ్లిసరిన్.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వాడే ప్రతి మందు యొక్క ఎక్స్పైరీ డేట్ ని చూసుకొని తీసుకోవాలి. లేకపోతే మీకే ప్రమాదం. వీటితోపాటు కుటుంబం మొత్తము ప్రతి 6 మంత్స్ కి ఒకసారి హెల్త్ చేయకపోతే చేయించుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎవరీ త్రీ మంత్స్ వస్తారు హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. హెల్త్ విషయంలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండవద్దు బయట ఫుడ్డు తినే బదులు ఇంటిలోనే ఆర్గానిక్ ఫుడ్ ను తినడం మంచిది.

Read More>>

Leave a Comment