Telangana విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది

Written by 24newsway.com

Published on:

Telangana విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్: చెప్పడం జరిగింది.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక శుభవార్త చెప్పింది అదేమిటంటే పర్యాటక చారిత్రక ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది తెలంగాణ దర్శిని అనే పేరుతో కొత్త కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి.

సాధారణంగా విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపెట్టినట్లయితే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు అనే శాస్త్రీయ నిరూపణలన ద్వారా నిరూపణ అయింది ఈ నేపథ్యంలో చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు తరగతి గదిలో చెప్పడం కంటే వారిని డైరెక్టుగా చారిత్రక పర్యాటక ప్రాంతాలను చూపించి ఆ చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి వివరిస్తే విద్యార్థులు మంచిగా అర్థం చేసుకుంటారని తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తలుపెట్టారు .అలాగే ఎస్కేజీ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ దర్శిని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.

రెండవ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ఆయా ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాలను చూపించడం జరుగుతుంది. అలాగే రవాణా ఇతరత్రా ఖర్చులకోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. తొలి దశలో లక్ష మంది విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది .

Telangana దర్శనీకి సంబంధించిన విధి విధానాలను జీవోలో పొందుపరిచారు అలాగే హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి ఒక అడుగు పడింది అని చెప్పవచ్చు పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫే రేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకు రావడం జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది వాటి పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది మూసి పరివాహన ప్రాంతాలలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా మార్చబోతున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు . మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.

పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తామని త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. జూబ్లీహాలు చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దాని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సిఐఐ కి సూచించారు సూచించడం జరిగింది, భవనాలు హైకోర్టు సిటీ కాలేజ్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది.

హైదరాబాద్ నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలకా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ మంచిర్యాల మెట్ల బావిని లైఫ్ సంస్థ దత్తత తీసుకున్న అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ ఆడిట్ మెట్ల బావిని దొడ్ల డైరీ సంస్థ పలకనామ మెట్ల బావిని టీజీ ఆర్టీసీ సంస్థ కోటిలోని రెసిడెన్సి మెట్ల బావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది.

Read More

🔴Related Post

Leave a Comment