తెలంగాణ రైతులకు Rythu Bharosa నిధులను తెలంగాణ ప్రభుత్వం అందజేయనుంది. స్థానిక ఎన్నికల కు ముందే తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా Rythu Bharosa నిధులను పంపిణీ మొదలుపెట్టింది.
ఇప్పుడు వానాకాలం మొదలు అయినది కాబట్టి వానకాల పంటలకు పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. రైతు భరోసా నిధులు తెలంగాణ ప్రభుత్వం ఎలా రైతులకు చెల్లిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.
మొదటి రోజు ఎన్ని ఎకరాల వారికి Rythu Bharosa:
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పైసలు మొదటి రోజు రెండెకరాలు ఉన్న రైతుకి ఎకరానికి 6000 చొప్పున రైతు ఎకౌంట్లోకి పంపిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది. 41. 25 లక్షలు రైతులకు సంబంధించిన 39. 16 లక్షల ఎకరాలకు 2,389.83 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది.
Rythu Bharosa నిధులు 9 రోజుల్లోనే రైతుల ఖాతాలోకి :
రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలోకి తొమ్మిది రోజుల్లోనే పంపిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది. రైతు భరోసా నిధులు విడుదల చేసిన మొదటి రోజు రెండు ఎకరాలు ఉన్నవాళ్లకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని మిగిలిన వాళ్ళకి తొమ్మిది రోజుల్లోనే అర్హత ఉన్న అందరి రైతుల ఎకౌంట్లోకి నిధులు జమా అవుతాయని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది. అయితే రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి ఇస్తారో మాత్రం ఇంతవరకు ఏ విధమైన స్పష్టత మాత్రం తెలంగాణ సర్కార్ ఇవ్వలేదు.
Rythu Bharosa ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం కింద 9000 కోట్ల రూపాయలు అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం కి రైతులంటే ఎంత ఇష్టమో రైతుల కోసం కష్టపడేది తమ ప్రభుత్వం అని తెలంగాణ రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా పైసలు వ్యవసాయదారిలో పెట్టుబడికి ఎంతగానో ఉపయోగపడతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఉన్న నాయకులు మాత్రం ముందు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలోకి వేసి రైతులను మభ్య పెట్టాలని తమ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలని చూస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ విధమైన ఇష్టము లేదని ఎన్నికల కోసమే ఈ రైతు భరోసా ఇస్తుందని తెలియజేయడం జరిగింది.