sai durgha tej new movie : హీరో సాయి దుర్గ తేజ్ కథానాయకుడిగా రోహిత్ కె పి దర్శకత్వంలో వస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. ప్రైమ్ సో ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు సాయి తేజ్ కెరీర్ లో ఇంత బడ్జెట్ తో ఏ సినిమా తిరగలేదు. తొలిసారి సాయి తేజ మార్కెట్ మించి ఖర్చు చేస్తున్నారు.
విరూపాక్ష 100 కోట్లు తెచ్చిన నమ్మకంతో ఈ మూవీ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం పూర్తయినట్టు తెలుస్తుంది అంతవరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రికరించారు. ఇది భారీ హై యాక్షన్ సీన్స్ అని సమాచారం ఈ సన్నివేశాల కోసం సాయి తేజ్ చాలా కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది.
sai durgha tej new movie రిస్క్ సన్నివేశాలు ఉన్నాయని ఏమాత్రం భయపడకుండా నటించాడట మరోవైపు దినేష్ మాస్టర్ ఒక పాట కూడా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ పాట కోసం ఏకంగా 1000 మంది డాన్సర్లు పనిచేస్తున్నారు. ఇంతమంది డాన్సర్ తో ఇప్పటివరకు పాట చిత్రీకరణ ఏ సినిమాకు జరగలేదు మొదటిసారి సంబరాలు ఏటిగట్టు కోసం టీం ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
మొత్తానికి సినిమాలో చాలా విశేషాలు కనిపిస్తుంది. ఇంకా షూటింగ్ 40 పర్సెంట్ పెండింగ్ ఉంది. ఆ సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి క్రేజ్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ లో తేజ్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి ఐశ్వర్య లక్ష్మి సాయికుమార్ శ్రీకాంత్ జగపతిబాబు తదితరులు నటులు ఈ మూవీలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.