sai pallavi latest movie : ఆ హీరోతో మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా…సాయి పల్లవి టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి పరిచయం అక్కర్లేదు మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా తో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసిన సాయి పల్లవి ఆపై చాలామంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అమ్మాయి పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.రీసెంట్ గా శివ కార్తికేయను తో జంటగా నటించి. అమరన్ చిత్రం లో మంచి పేరు తెచ్చుకుంది. అలానే నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీ లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. స్క్రిప్టు సెలక్షన్లో చాలా ఆచితూచి అడుగులు వేసి ఎంచుకుంటుంది. ఈ అమ్మాయి కథ అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి ఇష్టపడుతుంది. అలాంటి పాత్రలోనే నటిస్తూ ఆమె విజయాలను అందుకుంటున్నారు.
sai pallavi latest movie : అయితే తాజాగా సాయి పల్లవి కోలీవుడ్ లో మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు భావిస్తున్నారు. అది కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ ప్లే బాయ్ గా ముద్ర వేసుకున్న శింబుతో ఆమె నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. శింబు తో మూవీ వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఓకే చేశారు అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
శింబుప్రస్తుతం కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధగ్ లైఫ్ సినిమాలో నటి స్తున్నారు ఇటీవల నటుడు శింబు పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ మూవీ ని రాజు కుమార్ దర్శకత్వంతో ఉంటుందని. అనౌన్స్ చేశాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలోనె సాయి పల్లవి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
శింబు నటించిన గత సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ సాంగ్స్ ఉంటాయి. దీంతోనే సాయి పల్లవి ఆయనతో మూవీ ఎందుకు ఓకే చేసిందా అని చర్చ జరుగుతుంది. శింబు గతంలో నయనతార హన్సిక సహా పలువురు హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.