Sai Pallavi పైనే ఆశలు పెట్టుకున్న హీరో కొడుకు హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతో నే హిట్ తన ఖాతాలు వేసుకోని కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా స్టోరీలు ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందని చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటన చాలానే మనం చూస్తూ ఉన్నాము. తన తొలి సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నమైన పాత్రలోనే నటిస్తూ అభిమానులు ఎంతగానో అలరిస్తూ ఉన్నది తెలుగు తమిళ ఇలా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకుంది Sai Pallavi .
కథ నచి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తృప్తి ఇస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది తాజాగా సాయి పల్లవి ఫిలింఫేర్ అవార్డు దక్కింది. “గార్గి” సినిమాలో సాయి పల్లవి నటన గాను అవార్డు సాయి పల్లకి దక్కింది. తాజాగా సాయి పల్లవికి ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉంది.
వాటి లో స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు సినిమా కూడా ఉంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లో సెరవేగంగా జరుగుతుంది. సమ్మర్ కి ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జునైద్ ఖాన్ “మహారాజ్” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో జునైద్ ఖాన్ నటన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో సాయి పల్లవి తో చేస్తున్న సినిమాపైనే జునైద్ ఖాన్ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సాయి పల్లకి నేషనల్ వైడ్ క్రేజ్ ఉండడంతో ఆమెపైనే ఆశలు పెట్టుకొని వుంది చిత్ర యూనిట్. మరి Sai Pallavi తో చేసే సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.