samantha latest movie

Written by 24 News Way

Published on:

samantha latest movie : ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత తర్వాత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది అది తప్ప కాలంలోనే హీరోయిన్గా సమంత మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇలా హీరోలతో నటించారు ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంది. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత వీరు విడిపోయారు.

ఇదే సమయంలో సమంత కొంతకాలం మయాసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డారు ఆరోగ్యం సహకరించక పోవడంతో సమంత సినిమాలు చేయలేదు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొన్ని సినిమాలు చేసింది అందులో విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి మూవీ ఆ తర్వాత మళ్లీ ఏ మూవీ చేయలేదు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో మాత్రం ఆమె నటించిన. దాని తర్వాత సిటడేల్ వెబ్ సిరీస్ నటించారు ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్ టాక్ ను సొంతం చేస్తుంది. హీరో వరుణ్ ధావన్ తో కొన్ని సన్నివేశాలు సమంత నటించిన. విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి సమంత నిర్మాతగా కూడా మారబోతున్నారు ఆమె నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది.

samantha latest movie ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ సమంతను ఆసక్తికరమైన ప్రశ్నను అడిగాడు. మీ దగ్గర మూడు చాక్లెట్లు ఉంటే ఇండస్ట్రీలో ఎవరికి ఇస్తారు అని అడిగారు సదర్ రిపోర్టర్ అడిగాడు దీనికి సమంత సైతం తనదైన శైలిలో జవాబు ఇచ్చారు తనకు సినిమాలో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీ నాన్ కి మొదటి చాక్లెట్ ఇస్తానని చెప్పారు. తన లక్కీ హీరో విజయ్కు రెండో చాక్లెట్ ఇస్తానని చెప్పుకొచ్చింది. విజయ్ తను నటించిన సినిమాలన్నీ కూడా హిట్టు అని ఈ సందర్భంగా సమంత తెలపింది ఇక దర్శకుడు అట్లీకి మూడో చాక్లెట్ ఇస్తానని ఆయన తన సినిమాలో హీరోయిన్గా తనకి ఎక్కువ అవకాశం ఇచ్చారని అందుకే ఆయనకే మూడో చాక్లెట్ ఇస్తానని సమంత చెప్పుకు వచ్చారు. అయితే సమంత తెలుగు నుంచి ఒకరిని కూడా ఎంపిక చేసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read More>>

🔴Related Post