తెలుగు ఇండస్ట్రీలో Casting couch పై సంచలన కామెంట్ చేసిన సమంత

Written by 24newsway.com

Published on:

సమంత Casting couch తెలుగు ఇండస్ట్రీ: తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్ చేసిన సమంత. గత రెండు మూడు సంవత్సరాల నుంచి క్యాస్టింగ్ వివాదం ఎక్కడో ఒకచోట బయటికి వస్తూనే ఉన్నది. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రత భావంతో ఉన్నారని ఇటీవల ఒక సర్వేలో కూడా తేలటం జరిగింది . కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి దానిలో ఉన్నది కానీ ఒక్క సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే బయట ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నది . అలాగే సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగనే బహిరంగంగానే వెల్లడించారు.

అనేక లైంగిక వేధింపులు మరియు కమిట్మెంట్లు గురించి హీరోయిన్లు మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో రెండు మూడు సంవత్సరాల క్రితం క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక యుద్ధమే జరిగింది ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆ విషయం సద్దుమణిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మలయాళం ఇండస్ట్రీ లో మహిళల మీద జరిగే ఆకృత్యాల గురించి హేమా రిపోర్టు సంచలన రిపోర్ట్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ క్యాస్టింగ్ కౌచ్ వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవల ఒక తెలుగు నటి బహిరంగంగానే వెల్లడించారు ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలలో ప్రకంపనాలు సృష్టిస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు మరియు వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది తాజాగా దీనిపై హీరోయిన్ సమంత కూడా రియాక్ట్ కావడం జరిగింది. హేమా కమిషన్ నివేదికపై సమంత తన సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది.

సమంత కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీ

హీరోయిన్ సమంత గారు హేమ కమిషన్ గురించి స్పందిస్తూ మలయాళ ఇండస్ట్రీలో మహిళలు పడుతున్న కష్టాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పలు కీలక సూచనలు చేసిన హేమా కమిషన్ పట్ల సమంత ఆనందం వ్యక్తం చేశారు మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ చాలా బాగా పనిచేస్తుందని సమంతా గారు ప్రశంసించడం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సమంత గారు విజ్ఞప్తి చేశారు తెలుగు ఇండస్ట్రీలో మహిళ నటీమణులు సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని సమంత గారు ఈ సందర్భంగా కోరడం జరిగింది.

అసలు తెలుగు ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని మొట్ట మొదటిసారిగా ధైర్యం గా ముందుకొచ్చి చెప్పింది నటి శ్రీరెడ్డి. ఇంకా సినిమాలో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించే దీనిపై ఆమె కొన్ని వ్యాఖ్యలను చేస్తూ అలాగే కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది ఆ తర్వాత శ్రీ రెడ్డి చేసిన క్యాస్టింగ్ కోచ్ ఉద్యమం దారి తప్పడంతో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ మరుగున పడిపోయింది. మళ్లీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వివాదం అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది.

Read More>>

Leave a Comment