కొండా సురేఖకు మరోసారి కౌంటర్ ఇచ్చిన Samantha. సంవత్సరన్నర నుంచి సినిమాలు చేయకపోయినా గానీ దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోహిన్ గా చలామణి అవుతుంది మన హీరోయిన్ సమంత . సమంత తన ఆరోగ్య పరిస్థితి వల్ల ఈ విరామం తీసుకున్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత తన సొంత బ్యానర్లో ఓ సినిమాను కూడా నిర్మిస్తుంది ఇందులో హీరోగా ప్రియదర్శి నటిస్తున్నాడని ఈమధ్యనే తెలిసింది.
Samantha ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఈ సంవత్సరం మొదట్లోనే విడుదల కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల నవంబర్ 7 తారీఖున అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తుంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా కొత్తవారిని పరిచయం చేయబోతుందని తెలుస్తుంది ప్రస్తుతం ఇలాగ సాగుతున్న సమంతా జీవితంలో తెలంగాణ మంత్రి కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు సమంతా జీవితాన్ని ఇంకా బాధలోకి నెట్టేసాయని చెప్పవచ్చు.
Samantha విషయానికి వస్తే నాగచైతన్యతో సమంత విడాకులు అనంతరం ప్రతిరోజు ఏదో విషయమై సమంత గారు ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ద్వారా వైరల్ అవుతూనే ఉన్నారు. విడాకులు తీసుకున్న మొదట్లో తప్పు అంత సమంత ది అని అందరూ సమంతా ని ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత సమంత మయోసైటీ స్ బారిన పడింది. ఆ తర్వాత సమంత గురించి ఏదో ఒక న్యూస్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉన్నది. ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు ఒక ఏడాది పాటు గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందని మనందరికీ తెలిసిన విషయమే.
ఆ తర్వాత Samantha ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీసి డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు రావడం జరిగింది. ఆ వార్తలు సద్దుమణిగాక కొండా సురేఖ రూపంలో సమంతా వార్తల్లోకి నిలిచింది. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించడం జరిగింది. ఆ వార్తలతో కొండా సురేఖ గారు ట్రోలింగ్ గురి కావడం జరిగింది.
కొండా సురేఖ గారు చేసిన కామెంట్లకు అటు సమంతా నాగచైతన్య నాగార్జున అమల అఖిల్ అందరూ కలిసి ఘాటుగా స్పందించడంతో వివాదం ఇంకా పెద్దదిగా అయింది. కొండ సురేఖ గారికి అప్పుడే. సమంతా గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది అక్కినేని ఫ్యామిలీ మాత్రం కొండా సురేఖ గారి మీద నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది ఇప్పటికీ ఆ కేసు నాంపల్లి కోర్టులో నడుస్తుంది.
ఈ విషయమై సమంత గారు కొండ సురేఖ గారికి మరోసారి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా సమంత గారు హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. అక్కడ కొంతమంది విలేకరులు సమంతాని కొండా సురేఖ గారు చేసిన కామెంట్ల గురించి అడగడం జరిగింది. దానికి సమంత గారు బదిలీస్తూ ఈరోజు తాను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం సినిమా పరిశ్రమలోని ఎంతోమంది అభిమానుల ప్రేమ అని చెప్పడం జరిగింది .తనపై వారికి ఉన్న నమ్మకం ప్రేమ తనను ఈ స్థాయిలో ఉంటాయని సమంత చెప్పడం జరిగింది తన అభిమానులు ఇస్తున్న మద్దతే తనకున్న కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయని చెప్పడం జరిగింది .
అటువంటివారు తనకు మద్దతు లేకపోతే కొన్ని క్లిష్టమైన పరిస్థితులను అధిగమించలేక పోయేదానినని మరియు వాటిని వదులుకోవాలని అనిపించేదని కానీ అభిమానులు వారి నమ్మకం వల్లే వాటిని తాను ఎదుర్కోగలే గలిగాను అని సమంత చెప్పడం జరిగింది. సమంత ఇంకా మాట్లాడుతూ ఆన్లైన్లో తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై కూడా సమంత చాలా ఘాటుగా స్పందించింది తన పై వస్తున్న ట్రోలింగ్ చూసి అటువంటి వాటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనని ద్వేషంతో కూడిన సందేశాలను అస్సలు పట్టించుకోనని వాటి ప్రభావం తనపై లేకుండా చూసుకుంటానని అటువంటివి పంపించేవారు తను అనుభవిస్తున్న బాధను అలాంటి బాధనే అనుభవించారేమోనని అని కూడా ఆలోచిస్తానని సమంత వెల్లడించడం జరిగింది.
ఎవరు తన గురించి ఎంత చెడుగా ప్రచారం చేసినా గాని తాను అస్సలు ధైర్యం కోల్పోనని తనకు తన అభిమానులు ఇచ్చే ప్రేమ తనకి ఎల్లప్పుడూ ఉంటుందని అభిమానుల ప్రేమ కన్నా ఇటువంటివి తనకు అంత పెద్దగా అనిపించవని సమంత ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది.