సమంతా రీఎంట్రీ: టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పిలవబడుతున్న సమంత రి ఎంట్రీ ఇవ్వబోతుంది. కొంతకాలంగా సమంత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. సమంత ఖుషి సినిమా తర్వాత ఏ సినిమా ఇంతవరకు ఒప్పుకోలేదు. సమంత ప్రస్తుతం కదలని వింటుంది. మయోసైటీస్ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం ఏడాదికి పైగా సినిమాలకు విరామం ఇస్తానని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం దేశ విదేశాలు తిరిగింది.
నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా లేడి ఓరియెంటెడ్ కథతో రాబోతున్నట్టు ప్రకటించడం జరిగింది తన సొంత బ్యానర్ పైనే సమంత నిర్మిస్తున్నారు. సమంత సినిమాలో ఏడాది విరామం రావడంతో ఆ స్థానాన్ని ఇతర హీరోయిన్లు తన్నుకు పోవడం జరిగింది. సమంత మళ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం రీఎంట్రీ ఇవ్వబోతుంది. సమంతా ప్రస్తుతం సిటాడైల్ అనే వెబ్ సిరీస్ పూర్తి చేసింది.
ఈ క్రమంలోనే సమంతకు రెండు బంపర్ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది అట్లీ దరక త్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాని ప్రముఖ బ్యానర్ అయిన సన్ పిక్చర్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని తర్వాత మరో ఆఫర్ నీ కూడా సమంత పట్టేసింది రామ్ చరణ్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారని వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాగే సుకుమార్ గారు గతంలో సమంతా కి మాట ఇచ్చిన ప్రకారము సమంతా ని తన సినిమాలో తీసుకోవడం జరిగింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నది.
భారీగా ఆస్తులు కూడా పెట్టిన సమంత :
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత ఆస్తులు కూడా భారీగానే కూడా పెట్టిందని అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సిరి పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా సమంత అందుకుంది అప్పటినుంచి ఇప్పటివరకు సుమారు 14 సంవత్సరాల పాటు కెరీయర్ని కొనసాగిస్తూ ఉంది. ఆ తర్వాత హీరో నాగచైతన్య తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం తర్వాత విడిపోవడం కూడా చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సమంత మయోసైటిస్తో బాధపడుతుందని అందరికీ తెలిసిపోయింది. ఈ వ్యాధితోని బాధపడుతూ సమంత తన ఒప్పుకున్న సినిమాలన్నిటిని కంప్లీట్ చేసింది.
2010 సంవత్సరంలో కెరియర్ ప్రారంభించిన సమంత ఇప్పటివరకు సుమారు 120 కోట్ల ఆశ్రమం కూడా పెట్టినట్లు తెలుస్తుంది నిన్న సమంతా పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అందులో ఒకటి సమంత ఆస్తుల విషయం. వాటి వివరాలు తెలుసుకోవడానికి నేటిజెన్లు ఎక్కువగా ఆసక్తి కనపడుతున్నారు హీరోయిన్ గా రెమాన్యూ రేషన్ తో పాటు వాణిజ్య ప్రకటనలు మరియు సమంత సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంది వాటి ద్వారా కూడా చాలా డబ్బులను పోగు వేసినట్టు తెలుస్తుంది.
సమంత ప్రతి సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకుంటుంది. అలాగే తన సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టిందని సమాచారం. అలాగే సమంత సొంత వ్యాపారాలను కూడా నిర్వహిస్తుంది. ఫ్యాషన్ రంగంలో సొంత లేబుల్ తో ముందుకు సాగుతుంది. సమంతా కు కార్లు అంటే చాలా బాగా ఇష్టం. సమంతకు మూడున్నర కోట్ల విలువైన బెంజ్ కారు మరియు రెండున్నర కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ వీటితో పాటు ఒకటిన్నర కోట్ల విలువైన ఒక కారు. అలాగే 87 లక్షల విలువైన ఆడి కారు. సమంత దగ్గర ఉన్నాయి. వీటితోపాటు రెండు కోట్ల విలువైన బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారును కూడా ఈ మధ్య సమంత కొనుగోలు చేసింది.
ముంబైలో 15 కోట్ల విలువైన త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాటును సమంత పోయిన సంవత్సరం కొనుగోలు చేసింది అలాగే చెన్నై బెంగళూరు తహ మరికొన్ని ప్రాంతాల్లో కూడా సమంతకు ప్లాట్లు ఉన్నాయని సమాచారం. ఈ ప్లాట్ల విలువనే సుమారు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా.
సమంత తన సొంత ఫ్యాషన్ లేబుల్ అయినా సాకిని 2020లో ప్రారంభించింది. సన్ షైన్ కార్డ్ మార్కెట్ప్లేస్ ఇండియా సంస్థలో పెట్టుబడి పెట్టి ఈ కామర్స్ బిజినెస్ లోకి కూడా సమంత ప్రవేశించింది. సొంతంగా బ్యానర్ ని స్థాపించి ఇందులో మొదటి సినిమాగా రీసెంట్గా ప్రకటించిన బంగారం అనే సినిమాను కూడా ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన సమంత పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం.
గుడ్ లక్ సమంత.