తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన మాజీ భాగస్వామి నాగచైతన్య కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై నటి సమంత Samantha మాట్లాడారు. రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి జీవితంలో ముందుకు సాగడంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. “దాని నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో శ్రమించాను” అని బదులిచ్చారు. తరువాత విలేకరి.. “మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టినందుకు మీరు ఏమైనా అసూయ పడుతున్నారా” అని ప్రశ్నించగా.. నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని భావిస్తా” అని సమాధానం ఇచ్చారు.
అలాంటి వాటి గురించి తాను పెద్దగా ఆలోచించనని అన్నారు.
మాజీ భాగస్వామి గురించి సమంత మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు. ‘సిటడెల్: హనీ బన్నీ’ ప్రమోషన్స్లోనూ ఆమె మాట్లాడారు. “అవసరం లేకపోయినా మీరు ఏక్కువ మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?” అని ఆ ప్రాజెక్ట్ కోస్టార్ వరుణ్ ధావన్ ప్రశ్నించగా “నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు” అని బదులిచ్చారు Samantha. “ఎంత ధర ఉంటుంది?” అని అడగ్గా “కాస్త ఎక్కువే. ఇక కొనసాగిద్దాం” అంటూ ముగించారు. అయితే అప్పట్లో ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అంతకుముందు కరణ్ జోహార్ షోలో మాట్లాడుతూ తను, మాజీ ఒకే గదిలో ఉంటే.. దగ్గరలో కత్తులు ఉండకపోవడం మంచిది అని అన్నారు.
నాగచైతన్య రెండో పెళ్లి..
నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వర్క్ లైఫ్ విషయానికి వస్తే.. ఇప్పుడు Samantha ఇటీవల ‘సిటడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్టుతో అలరించారు.ఈ ప్రాజెక్టులో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన . 80-90ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అందులో చూపించారు. హనీ పాత్రలో సమంత నటించారు. కుమార్తె నదియాను రక్షించుకొనే తల్లి పాత్రలో కన్పించారు. స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు. దీంతోపాటు ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్లోనూ నటిస్తోంది.