SandeepReddyVanga ని కలిసిన Junior NTR . జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతము దేవర పార్ట్ వన్ తో బిజీగా ఉన్నాడు. దేవర షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రమోషన్ మీద ఎన్టీఆర్ కొరటాల శివ దృష్టి పెట్టడం జరిగింది. దేవర పార్ట్ 1 ప్రమోషన్ కోసం ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్ కొరటాల శివ ఉన్నారు. అయితే దేవర ట్రైలర్ లాంచ్ కు ముందు ఎన్టీఆర్ అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల మన తెలుగు దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగాతో సమావేశం అవడంతో ఇప్పుడు ఈ వార్త చాలా వైరల్ గా మారింది తారక్ సందీప్ రెడ్డి వంగ కలిసిన ఒక ఫోటో ఇంటర్నెట్లో ప్రస్తుతం సంచలనంగా మారింది .
ఈ ఫోటో చూసిన వారు వారిద్దరు కలిసి ఏమైనా కొత్త ప్రాజెక్టు కోసం కలిశారేమోనని తెలుగు అభిమానులు మరియు ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్రాజెక్టు చేస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మనందరికీ తెలుసు ఎందుకంటే SandeepReddyVanga గారు తీసే సినిమాలన్నీ చాలా వైలెంట్ గా ఉంటాయి. ఇక ఎన్టీఆర్ సంగతి సరేసరి తెలుగులో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మాస్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ అని బల్లగుద్ది చెప్పవచ్చు. అయితే వీరిద్దరి సమావేశం గెస్ట్ సాధారణంగా జరిగిందని మీరు కలిసి ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశం లేదని తెలుస్తుంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహించిన Junior NTR హీరోగా నటించిన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా అయిన దేవర మూవీ ఈనెల సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లోకి రానుంది దేవర చిత్రంలో జాహ్నవి కపూర్ తొలిసారిగా తెలుగులో నటించడం జరుగుతుంది.. అలాగే బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించడం ఇంకో గొప్ప విషయం. ఇంతవరకు సైఫ్ ఆలీ ఖాన్ బాలీవుడ్ చిత్రాలలో మాత్రమే నటించారు అది కూడా హీరోగా మాత్రమే నటించడం జరిగింది తొలిసారిగా ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటించడం జరుగుతుంది.
ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆర్ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ఆర్ఆర్ ఆర్ మూవీ బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని సాధించింది. అలాగే ఈ ఆర్ ఆర్ మూవీ ఇండియాలో ఏ సినిమాకి రానటువంటి ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ వరల్డ్ మార్కెట్ లోను ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకున్నాయి. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ మరియు సైఫ్ ఆలీ ఖాన్ గారు నటించడం తో బాలీవుడ్ లోనూ ఈ సినిమా మీద భార్యా అంచనాలను నెలకొన్నాయి. చూడాలి ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 మూవీ విడుదలై ఎన్ని సంచలనాల సృష్టిస్తుందో. దేవర పార్ట్ 1 మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ మరియు సుధా ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా వస్తుంది.