OTTలోకి వచ్చేస్తున్న MathuVadhalara 2 Movie: రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో విజయం సాధించిన చిత్రాలలో మొదటి వరసలో ఉండే చిత్రం మత్తు వదలరా 2 మూవీ . ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ చిత్రం. శ్రీ సింహ హీరోగా పర్యా అబ్దుల్లా హీరోయిన్ గా కామెడియన్ సత్య సాలిడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రితేష్ రానా తెరకెక్కిచ్చిన చిత్రం మత్తు వదలరా 2 మూవీ. ఈ MathuVadhalara 2 Movie మంచి వసూలను రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు యూఎస్ మార్కెట్ లో కూడా వసూళ్లతో అదరగొట్టిన విషయం మన అందరికీ తెలిసినదే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది కమెడియన్ సత్య గురించి.
కమెడియన్ సత్య ఈ చిత్రంలో చేసిన పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎంత ముఖ్యపాత్ర వహించారో అంతకన్నా డబల్ కమెడియన్ సత్య కామెడీ పండించడం జరిగింది. అసలు ఇందులో సత్య పాత్ర చూసి మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త కమెడియన్ దొరికాడు అని అందరూ మెచ్చుకోవడం జరిగింది. కామెడియన్ సత్యా నీ ఈ సినిమా చూసిన వాళ్ళు మరో బ్రహ్మానందం మరో సునీల్ దొరికాడు అనుకోవడం ఒక గమనార్ధం. కమెడియన్ సత్య ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించడం జరిగింది.. అన్ని సినిమాల్లో వచ్చిన పేరు ఒక ఎత్తు అయితే మత్తు వదలరా పార్ట్ 1 పార్ట్ 2 లలో చేసిన పాత్ర ఒక ఎత్తు.
అయితే ఈ చిత్రం ఇప్పుడు OTT లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది ఈ సినిమా హక్కులను ప్రముఖ దిగ్గజ కంపెనీ అయినా Net Flix సొంత చేసుకోవడం జరిగింది ఈ సినిమా ను అక్టోబర్ 11 నుంచి అందుబాటు లోకి తీసుకొస్తున్నట్లుగా నెట్ ఫ్లెక్స్ సంస్థ తెలియజేయడం జరిగింది దీనితో ఈ క్రేజీ థ్రిల్లర్ ఆ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది ఈ దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ని నెట్ ఫ్లెక్స్ వాళ్లు అందుబాటు లోకి తీసుకొని వస్తున్నారు ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది.
దసరా పండగ స్పెషల్ గా వస్తున్న మత్తు వదలరా 2 మూవీ ని చూస్తూ పండగను ఎంజాయ్ చేయండి ఇంకా ఎందుకు ఆలస్యం .