Malluindustry మీద ఆరోపణలగురించి సంచలనకామెంట్ చేసిన Samantha. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గారు సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకున్న గాని సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటారు. ఆడవాళ్లకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ముందుగా స్పందించే హీరోయిన్ల లో సమంత గారు చాలా ముందుంటారు. ఏదైనా ఆడపిల్లకు గాని ప్రాబ్లం అని తెలిస్తే తనకు తోచిన సహాయం కూడా చేస్తుంటారని మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు. సమంత గారు అనాధ పిల్లలకు తనకు తోచిన సహాయం చేస్తుంటారని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మలయాళ ఇండస్ట్రీ గురించి గత కొంతకాలం గా చాలా వార్తలు వచ్చి వైరల్ గా మారాయి. ఆ వార్తలు వల్ల మలయాళం ఇండస్ట్రీ పరువు పూర్తిగా పోయిందని చెప్పవచ్చు. ఈ వార్తలు మలయాళ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తుందని మాత్రం చెప్పవచ్చు.
Malluindustry లో ప్రకంపనాలు సృష్టిస్తున్న హేమా కమిటీ రిపోర్ట్ పై తాజాగా హీరోయిన్ సమంత స్పందించడం జరిగింది .హేమా కమిటీ పనితీరును సమంత ప్రశంసలతో ముంచెత్తారు కేరళ లోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్ట్ కలెక్టివ్ చొరవ వల్ల హేమ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిసింది. దీని కారణంగా మలయాళ పరిశ్రమల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు, బయటికి రావడం జరిగింది. సురక్షితమైన గౌరవ పరమైన పని ప్రదేశాల కోసం మహిళలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది ఇప్పటికైనా ఈ విషయాల పైన సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ నటి సమంతా గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సమంత గారే కాకుండా చాలా మంది సెలబ్రెటీలు ఈ విషయంపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
హేమా కమిటీ నివేదికపై నటి సమంత తొలిసారిగా స్పందించారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. మలయాళం ఇండస్ట్రీ అంటే మంచి కాన్సెప్ట్ మరియు రియాల్టీ సినిమాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉందని అలా తను భావించానని కానీ ఈ గత కొన్ని రోజులుగా మలయాళ ఇండస్ట్రీ గురించి వచ్చిన వార్తలు చూసి తను చానా బాధపడ్డానని సమంత గారు చెప్పుకొచ్చారు . ఇంకా సమంత మలయాళ ఇండస్ట్రీ మీద వచ్చిన ఆరోపణల గురించి సమంత ఈ విధంగా స్పందించారు ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉన్నాను దీని పనితీరు వల్లే హేమా కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. దీని చొరవ వల్ల ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొ మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ఇబ్బందులు వెలుగులోకి రావడం జరిగాయి ఇప్పటికైనా ఈ విషయాలపై సరైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను అని డబ్ల్యూ సిసి లో ఉన్న నా స్నేహితులకు సోదరీమణులకు నా కృతజ్ఞతలు అంటూ సమంత గారు తన ఇన్స్ట్రా స్టోరీలో చెప్పుకో రావడం జరిగింది.
హేమా కమిటీ నివేదికలో చాలా మంది మలయాళం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు పేర్లు బయటికి రావడం జరిగింది. మలయాళం ఇండస్ట్రీస్ సంబంధించిన సీనియర్ నటులపై అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది సీనియర్ నటులపై మాత్రమే కాకుండా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా అనేక ఆరోపణలు రావడంతో వీటిని అన్నిటికి నైతిక బాధ్యత వహిస్తూ మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మోహన్ లాల్ గారు తన అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆయనతోపాటు మరో 17 మంది తమ పదవుల నుంచి వైదొలిగారు హేమా కమిటీ నివేదికపై ఇప్పటి కె మలయాళం సినిమా ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ చాలామంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్ధం.