సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్.. ఏం జరిగింది? బాలీవుడ్ నటుడు Sonu Sood గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే మాటను ఈ సోను సూద్ గారు పర్పెక్ట్ గా సెట్ అవుతాయి. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి బయపెట్టినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ రియల్ హీరో అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా టైం లో వేలమందికి అండగా నిలిచారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు,పేదలు ప్రాథమిక అవసరాలను తీర్చారు. సోను సూద్ ని అరెస్ట్ చేయాలంటూ కోర్టు అరెస్ట్ వారెంట్ వేసింది. ఇంతకీ ఏం జరిగింది?
సోనూసూద్ ‘కల్లగర్’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక 2009లో విడుదలైన ‘అరుంధతి’ సినిమాలో పశుపతి అనే నెగటివ్ క్యారెక్టర్ లో నటించి, తెలుగు ప్రేక్షకులను సోనూ సూద్ మెప్పించాడు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇలా పలు తెలుగు, కన్నడతో పాటు హిందీలో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. ఈ క్రమంలో ‘దబాంగ్’, ‘జోధా అక్బర్’తో పాటు పలు సినిమాలతో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక కోవిడ్ సమయంలో ‘సోనూ సూద్ ఛారిటీ’ అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగుపడినా తన సమాజ సేవను కొనసాగిస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు సోను సూద్. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారంటూ పలు ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆ నటుడు ఎప్పుడూ కూడా ఆ పుకార్లపై స్పందించకుండా సామాజిక సేవ చేస్తున్నారు.
ఇదెలా ఉంటే.. పంజాబ్ లోని లూథియానాలోని క్రిమినల్ కోర్టు బాలీవుడ్ నటుడు Sonu Sood పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ జారీ చేశారు. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో సోను సూద్ పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. రూ.10 లక్షల మోసం కేసులో సాక్ష్యం చెప్పడానికి సోనూసూద్ ను కోర్టుకు పిలిచారు, కానీ అతను హాజరు కాలేదు, దీంతో తాజాగా సోను సూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
.అసలు విషయం ఏమిటి? లూథియానా న్యాయవాది రాజేష్ ఖన్నా ఈ కేసును దాఖలు చేశారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను నకిలీ రిజికా కాయిన్ లో పెట్టుబడి పెట్టమని ప్రేరేపించాడని, దీనివల్ల తనకు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించాడు. ఈ కేసులో కోర్టు Sonu Sood సాక్ష్యం కోసం పిలిచింది. జనవరి 29న జారీ చేసిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. బైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ అధికారిని నటుడు సోన్ సూద్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.