హాట్ టాపిక్ గా Singer Mangli మందు పార్టీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ మందు పార్టీ చేవెళ్ల దగ్గరలో ఉన్న ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో బుధవారం అర్ధరాత్రి చాలా గ్రాండ్ గా జరిగినది.
Singer Mangli పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఈ మందు పార్టీలో మంగ్లీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మరియు బంధువులు మరియు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది రావడం జరిగింది. ఈ పార్టీలో మొత్తం 50 మంది పాల్గొన్నారు అని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ పార్టీలో ఒక సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అది ఏమిటంటే ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం తో పాటు గంజాయి సరఫరా కూడా జరిగిందని పోలీసులు చెప్పడం జరిగింది. దీనిమీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ పార్టీ గురించి సమాచారం అందుకున్న చేవెల్ల పోలీసులు త్రిపుర రిసార్ట్ మీద దాడి చేయడం జరిగింది. ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం నీ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనితోపాటు ఈ పార్టీకి వచ్చిన 50 మందిని పట్టుకొని గంజాయి టెస్ట్ చేయించగా అందులో 9 మంది పాజిటివ్ వచ్చింది. ఈ సంఘటనతో పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Singer Mangli ఈ పార్టీ గురించి ఏం చెప్పింది :
సింగర్ మంగ్లీ ఈ పార్టీ గురించి చెబుతూ ఈ పార్టీ తన బర్త్డే సందర్భంగా ఇచ్చాను. ఇక్కడ జరిగింది నా బర్త్ డే పార్టీ మాత్రమే రేవ్ పార్టీ కాదు. అలాగే ఈ పార్టీలో మా అమ్మానాన్న కూడా ఉన్నారని అమ్మా నాన్నని పక్కన పెట్టుకొని ఎవరైనా అలాంటి పనులు చేస్తారా అని మంగ్లీ తిరిగి ప్రశ్నించడం జరిగింది. అలాగే పాజిటివ్ వచ్చిన 9 మందికి తనకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ఎక్కడో గంజాయి తీసుకొని ఇక్కడికి వచ్చారని ఆ విషయాన్ని నేను పోలీసులకు కూడా వివరించి చెప్పడం జరిగిందని మంగ్లీ వీడియో ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది.
Singer Mangli బర్త్ డే పార్టీలో ఉన్న heroine ఎవరు :
ఈ బర్త్ డే పార్టీలో ఒక హీరోయిని కూడా పాల్గొన్నదని చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు గాడ్ ఫాదర్ పుష్పా 2 వంటి సినిమాలలో నటించిన దివి. దీవి ఈ మధ్యనే సినిమాలలో నటిస్తూ పాపులారిటీని పెంచుకుంటూ ముందుకు వెళుతుంది. హీరోయిన్ దివి కి సినిమాల ద్వారా కంటే బిగ్బాస్ షో ద్వారా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకోవడం జరిగింది. అడపాదడపా సినిమాలో చేస్కు తన పాపులారిటీని దీవి పెంచుకుంటుంది. హీరోయిన్ దీవి మంగ్లీ బర్త్డే పార్టీలో పాల్గొన్న అని స్వయంగా తెలియజేసింది. మంగ్లీ తన స్నేహితురాలని అందుకే పాల్గొన్నారు అని తెలియజేయడం జరిగింది.
దివి ఇంకా మాట్లాడుతూ సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని తప్పుడు ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దివి మండిపడింది. మీ దగ్గర ఏదైనా సరైన ఆధారం ఉంటే సోషల్ మీడియాలో పెట్టి నిరూపించండి అని దివి చాలా ఘాటుగా చెప్పడం జరిగింది.
చూడాలి ఇంకా ఈ పార్టీ గురించి ఎలాంటి వార్తలు బయటికి వస్తాయో చేవెళ్ల పోలీసులు మాత్రం ఈ కేసుని చాలా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.